Kannam Anjaiah : దళితులపై వివక్ష చూపుతున్న బండి సంజయ్ : బీజేపీ నేత కన్నం అంజయ్య

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.

Kannam Anjaiah : దళితులపై వివక్ష చూపుతున్న బండి సంజయ్ : బీజేపీ నేత కన్నం అంజయ్య

kannam

Updated On : March 14, 2023 / 3:55 PM IST

Kannam Anjaiah : బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పై ఆ పార్టీ ధర్మపురి నియోజకవర్గ ఇంచార్జి కన్నం అంజయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పై పలు విమర్శలు చేశారు. బండి సంజయ్ దళితులపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. దళితులకు ఒక్క పదవి కూడా ఇవ్వకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. దేశం కోసం ధర్మం కోసం కష్టపడుతున్న కార్యకర్తలను మెచ్చుకోవడం లేదన్నారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని పేర్కొన్నారు. కోర్ కమిటీలో దళితులకు పదవులు ఇస్తున్నారా అని చర్చించబోమని చెప్పారు. బీసీ నాయకుడిగా ఉండి దళితులకు పదవులు ఇవ్వడం లేదన్నారు.

ఆర్థికంగా సపోర్ట్ చేసేవాళ్లకు బండి సంజయ్ సపోర్ట్ చేస్తున్నారని ఆరోపించారు. బండి సంజయ్ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదని విమర్శించారు. సొంత పైసల తోటి కార్యకర్తలు పని చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్న, మొన్న వచ్చిన వారు జాతీయ నాయకులవుతారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు చనిపోతే వాళ్ళింటికి పోకుండా ఇంకేం భరోసా ఇస్తావని ప్రశ్నించారు. కరీంనగర్ లో వ్యతిరేక ఆత్మీయ సమ్మేళనం పెడతామని చెప్పారు. కరీంనగర్ కోర్టు చౌరస్తాలో దళితులకు పదవులు ఇచ్చావో తెలుసుకుందామని సవాల్ చేశారు.

MP Dharmapuri Arvind : కవిత‌పై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను-బీజేపీ ఎంపీ హాట్ కామెంట్స్

ఏ జిల్లాకు దళితున్ని జిల్లా అధ్యక్షులు చేయలేదన్నారు. ఎస్సీ వర్గీకరణ చేయమన్నందుకు తనపై బండి సంజయ్ కక్ష పెంచుకున్నాడని తెలిపారు. తాము కట్టిన జండాలకు మాజీ ఎంపీ వివేక్ రంగులు వేసి జెండాలు ఎగరేస్తాడని విమర్శించారు. దళితుల మధ్యలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సభ్యునిగా చేస్తే దళితులకు అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు.