CM Jagan : ఏపీ అన్నదాతలకు శుభవార్త.. పప్పు ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలను అమ్ముకునే సమయంలో రైతులు దళారుల చేతిలో మోస పోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

CM Jagan : ఏపీ అన్నదాతలకు శుభవార్త.. పప్పు ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం

JAGAN

Updated On : March 14, 2023 / 9:33 AM IST

CM Jagan : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త చెప్పింది. సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పంటలను అమ్ముకునే సమయంలో రైతులు దళారుల చేతిలో మోస పోకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రబీ సీజన్ లో పండించే పప్పు ధాన్యాలను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకుంది.

ఏపీలో రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు

99 వేల 278 టన్నుల మినుములు, లక్షా 22 వేల 9 వందల 33 టన్నుల శెనగలు, 45 వేల 864 టన్నుల వేరు శనగ, 19 వేల 403 టన్నుల పెసర్లను రైతుల నుంచి కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.