Home » Author »bheemraj
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ ను చోరీ చేశారు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్లో తన దుస్తులతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. ఈ ఘటనపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. ప్రజలకు మేలు చేసే పని ఒక్కటైనా పవన్ చేశారా అని నిలదీశారు. చంద్రబాబు బాగుపడాలనేదే పవన్ అంతిమ లక్ష్యం అన్నారు.
ప్రధాని మోదీకి మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు లేఖ రాశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్టు దుస్థితికి కారణమని కేవీపీ లేఖలో ప్రస్తావించారు.
టీఎస్ పీఎస్ పీ పేపర్ లీక్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో 13 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేణుక ప్రభుత్వ టీచర్ గా పని చేస్తున్నారు. తమ్ముడి కోసం ప్రవీణ్ చేత రేణుక పేపర్ లీక్ చేయించారు.
వివేక హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెల్లడయ్యే వరకు అవినాష్ పై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్�
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంలో పునరాలోచన లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. అయితే ఈ విషయంపై ఉద్యోగ, కార్మిక సంఘాలతో ప్లాంట్ యాజమాన్య�
బండి సంజయ్, అర్వింద్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ప్రియార్టీలో తెలంగాణ లేదు, ఇక్కడి నేతలు లేరని పేర్కొన్నారు. కిషన్ రెడ్డికి బాత్ రూమ్ లు కడిగే శాఖ ఇచ్చారని తెలిపారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యలకు వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
థైరాయిడ్‌తో పోరాడుతున్న ఓ గృహిణి జాతీయ బాడీబిల్డింగ్ పోటీల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు. ఉత్తరాఖండ్ లోని పౌరీ గర్హావాల్ కు చెందిన ప్రతిభా తప్లియాల్ (41) అనే గృహిణి 13వ నేషనల్ సీనియర్ ఉమెన్స్ బాడీ బిల్డింగ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ స�
బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఉమ్మడి రాష్ట్రంలో మూత పడలేదన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం షుగర్ ఫ్యాక్టరీని మూసేశారని తెలిపారు.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కొడుకుకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన కొడుకుకు ఫోన్ చేసి భూతు పదాలతో దూషించి చంపుతామని బెదిరించ�
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఓ ఈవెంట్లో షకీబ్ అల్ హసన్ కోపంతో అభిమానిని కొట్టాడు. షకీబ్ ఒక ప్రచార కార్యక్రమంలో తన కోపాన్ని అదుపు చేసుకోకుండా ఆవేశంతో అభిమానిని క్యాప్‌తో కొట్టాడు.
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఇవాళ్టి శనివారం నుంచి ఏపీలో పర్యటించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి బయల్దేరి విజయవాడకు చేరుకోనున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఆర్.ధృవనారాయణ(61) కన్నుమూశారు. శనివారం ఛాతి నొప్పితో ఆయన మరణించారు. ధృవనారాయణ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను అరెస్టు చేసిన ఈడీ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇప్పటివరకు జరిగిన విచారణ, లభ్యమైన అంశాలను బట్టి ఎక్సైజ్ పాలసీ తయారీ ప్రక్రియలో సిసోడియా ప్రమేయం ఉందని స్పష్టమవు�
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ (శనివారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసుకు కవిత వెళ్లనున్నారు. నిరసనలు జరుగొచ్చన్న నేపథ్యంలో ఈడీ కార్యాలయం ముందు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
వివేకా హత్యపై వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తుల కోసమే వివేకా హత్య జరిగిందని తెలిపారు. హత్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయని పేర్కొన్నారు.
జార్ఖండ్ గొడ్డా జిల్లాలోని ఓ పోలీస్ స్టేషన్ లో మద్యం తాగి డ్యాన్సులు చేసిన పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. కొందరు పోలీసులు ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మద్యం సేవించారు. ఆ తర్వాత డ్యాన్సులు కూడా చేశారు.
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మహిళా గోస-బీజేపీ భరోసా దీక్