New Secretariat, Martyrs Stupam : ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం, జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

New Secretariat, Martyrs Stupam : ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం, జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ

New Secretariat

Updated On : March 10, 2023 / 3:22 PM IST

New Secretariat, Martyrs Stupam : తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవ ముహూర్తం ఖరారు అయింది. ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. అలాగే జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరణ జరుగనుంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రకటించారు. శుక్రవారం మార్చి10న నూతన సచివాలయ భవనాలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. ముహూర్తంలోగా పెండింగ్ పనులు పూర్తి చేయాలని సూచించారు. భవనాల తుది మెరుగులపై సీఎం కేసీఆర్ అధికారులకు పలు సూచనలు చేశారు. యుద్ధ ప్రాతిపదికన బ్యాలన్స్ పనులు అధికారులను ఆదేశించారు.

ఏప్రిల్ 30న తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ డేట్ ఫిక్స్ చేశారు. అదే విధంగా జూన్ 2న అమరవీరుల స్థూపం ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఆ రోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అమరవీరుల స్థూపాన్ని ప్రారంభించాలని సీఎం భావించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో పనులను వేగవంతం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో పాటు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కూడా జరుగనుంది. ఇప్పటికే అంబేదర్క్ విగ్రహ ఆవిష్కరణను తేదీ 14నగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

Telangana New Secretariat: తెలంగాణ చరిత్రను ప్రతిభింబించేలా నూతన సచివాలయం.. ఆర్కిటెక్ట్‌లు ఏం చెప్పారంటే ..

అంతకముందు సీఎం కేసీఆర్ తెలంగాణ నూతన సచివాలయానికి వెళ్లారు. నూతన సచివాలయ నిర్మాణం పనులను పరిశీలించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. సచివాలయ నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులతో సీఎం కేసీఆర్ మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. పోర్టికో నుంచి నడుచుకుంటూ ప్రతి ఫ్లోర్ లో పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఆరో అంతస్తులోని సీఎం పేషీ ఫ్లోర్ పనులను కేసీఆర్ పర్వవేక్షించారు. అధికారులకు సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు.  ప్రతి ఫ్లోర్ లో పనులను పరిశీలించారు.

దాదాపు రెండు గంటలకుపై సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. నిర్మాణం పనులను వేగవంతం చేయాలని ఆధికారులను ఆదేశించారు. 80 శాతానికిపైగా పనులు పూర్తయ్యాయని అధికారులు సీఎం కేసీఆర్ కు చెప్పారు. సెక్రటేరియట్ లోని ఆరు ఫ్లోర్లను సీఎం కేసీఆర్ కాలి నడకనే తిరిగి నిర్మాణం పనులను పరిశీలించారు. నిర్మాణం పనులు వేగంగా పూర్తి చేయాలన్నారు. అధికారులకు పలు సూచనలు చేశారు. మెయిన్ గేట్ బయటి వరకు కూడా సీఎం కేసీఆర్ నడుచుకుంటూ వచ్చారు.

Telangana State Secretariat: ఎన్నో ప్రత్యేకతలతో తెలంగాణ నూతన సచివాలయ నిర్మాణం

అనంతరం సీఎం కేసీఆర్ అంబేదర్కర్ విగ్రహం వద్దకు వెళ్లి అక్కడ జరుగుతున్న విగ్రహ పనులను పరిశీలించారు. మిగిలిన నిర్మాణం పనులను చాలా వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం స్వయంగా ఇక్కడకు వచ్చిన విగ్రహ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈమేరకు సీఎం అధికారులకు ఆదేశాలు కూడా ఇచ్చారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు అంబేద్కర్ జయంతి రోజు విగ్రహ ఆవిష్కరణ ఉండనుంది. అలాగే భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయనున్నారు.