R Dhruvanarayana Died : కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ కన్నుమూత

కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఆర్.ధృవనారాయణ(61) కన్నుమూశారు. శనివారం ఛాతి నొప్పితో ఆయన మరణించారు. ధృవనారాయణ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు.

R Dhruvanarayana Died : కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ ధృవనారాయణ కన్నుమూత

R Dhruvanarayana

Updated On : March 11, 2023 / 10:53 AM IST

R Dhruvanarayana Died : కర్ణాటక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ ఆర్.ధృవనారాయణ(61) కన్నుమూశారు. శనివారం ఛాతి నొప్పితో ఆయన మరణించారు. ఛాతిలో నొప్పి రావడంతో ఆయనను ఉదయం 6:40 గంటలకు మైసూరులోని డిఆర్‌ఎంఎస్ ఆసుపత్రికి ఆయన్ను డ్రైవర్ తీసుకువచ్చాడు. అయితే, ఆయన ప్రాణాలతో లేడని ఆసుపత్రి వైద్యుడు తెలిపారు. ఆర్ ధృవనారాయణకి ఛాతీ నొప్పి రావడంతో డ్రైవర్ ఉదయం 6:40 గంటలకు ఆయనను కారులో తీసుకుని ఆస్పత్రికి వచ్చారని డాక్టర్ మంజునాథ్ పేర్కొన్నారు. కానీ ఆయన ప్రాణాలతో బయటపడలేదన్నారు. ఆర్ ధృవనారాయణ కన్నుమూశారని తెలిపారు.

ధృవనారాయణ మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని తెలియజేశారు. మాజీ ఎంపీ, కేపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.ధృవనారాయణ వంటి నాయకుడిని కోల్పోయినందుకు తన గుండె పగిలిపోతోందని ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ బివి అన్నారు. అతని మరణ వార్త విని షాక్ గురయ్యాయని, మాటల్లో చెప్పలేనంత బాధ ఉందన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాని చెప్పారు.

BS Yeddyurappa : కర్ణాటక మాజీ సీఎం యడియూరప్పకు తృటిలో తప్పిన ప్రమాదం

అతని కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. మాజీ ఎంపీ, కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ ఆర్.ధ్రువనారాయణ మరణవార్త బాధాకరమని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సంయుక్త కార్యదర్శి కృష్ణ అల్లవరపు ట్వీట్ చేశారు. అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని తెలిపారు.