TDP MLAs suspend : ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

TDP MLAs suspend : ఏపీ అసెంబ్లీ నుంచి 11 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్

TDP members Suspension

Updated On : March 18, 2023 / 10:37 AM IST

TDP MLAs suspend : ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. అంతకముందు అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియాన్ని సభ్యులు చుట్టుముట్టారు. సీఎం ఢిల్లీ పర్యటనపై వాస్తవాలు చెప్పాలంటూ ఆందోళన చేపట్టారు.

ఆందోళన విరమించాలని స్పీకర్ ఎంత చెప్పినా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా అలాగే ఆందోళన కొనసాగించారు. సభకు ఆటంకం కలిగిస్తుండటంతో టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పీకర్ తమ్మినేని సీతారాం కోరారు. దీంతో స్పీకర్ ఇవాళ (శనివారం)  ఒక్క రోజు పాటు 11 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.

CAG Report in AP Assembly : ఏపీ అసెంబ్లీకి కాగ్ నివేదిక .. కీలక అంశాల ప్రస్తావన

అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవాని, చినరాజప్ప, గద్దె రామ్మోహన్, గణబాబు, వెలగపూడి రామకృష్ణ మంతెన, గొట్టిపాటి, ఏలూరి సాంబశివరావు, డోలా బాలవీరాంజనేయస్వామి, బెందాలం అశోక్ ను సస్పెండ్ చేశారు. సీఎం డిల్లీ పర్యటనపై వాస్తవాలు చెప్పాలని నినాదాలు చేస్తూ టీడీపీ సభ్యులు బయటికి వచ్చారు.