Rajasthan : రాజస్థాన్‌లో డ్రాప్‌ టవర్ రైడ్ కుప్పకూలి 11 మందికి గాయాలు

రాజస్థాన్‌ అజ్మీర్‌లోని ఓ ఉత్సవంలో డ్రాప్‌ టవర్ రైడ్ కుప్పకూలడంతో 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది.

Rajasthan : రాజస్థాన్‌లో డ్రాప్‌ టవర్ రైడ్ కుప్పకూలి 11 మందికి గాయాలు

Drop-Tower Ride

Updated On : March 22, 2023 / 4:50 PM IST

Rajasthan : రాజస్థాన్‌ అజ్మీర్‌లోని ఓ ఉత్సవంలో డ్రాప్‌ టవర్ రైడ్ కుప్పకూలడంతో 11 మంది గాయపడ్డారు. ఈ సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రైడ్స్ కేబుల్ తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెబుతున్నారు. ఫెయిర్‌గోయర్స్ క్యాప్చర్ చేసిన క్రాష్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో క్లిప్‌లలోని ఒకదానిలో రైడ్ కిందికి వస్తున్నప్పుడు తిరుగుతున్నట్లు కనిపిస్తోంది.

క్షణాల్లో ఎత్తైన ఊయల అకస్మాత్తుగా నేలపైకి పడిపోవడంతో అరుపులు, కేకలు వినిపించాయి. ఇతర వీడియో క్లిప్ లలో కూడా కుప్పకూలిన రైడ్ చుట్టూ ప్రజలు నొప్పితో ఏడుస్తున్నట్లు కనిపిస్తున్నారు. స్థానికులు కింద పడినవారిని పైకి లేపారు. ఈ ఘటనలో 11 మంది గాయపడ్డారని ఓ పోలీసు అధికారి తెలిపారు. క్షతగాత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

Video: ఢిల్లీలో భయానక ఘటన.. ఒక్కసారిగా కుప్పకూలిన భవనం

అయితే క్షతగాత్రులందరూ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారని పేర్కొన్నారు. రైడ్ కేబుల్ విరిగిపోయి నేలపై పడటంతో ప్రమాదం జరిగిందని వెల్లడించారు. కాగా, గతేడాది ఇదే తరహాలో పంజాబ్‌లోని మొహాలీలో దసరా ఉత్సవంలో ఎత్తైన ఊయల కూలిపోవడంతో చిన్నారులు సహా 16 మంది గాయపడ్డారు.