Home » Author »bheemraj
ఈ నెల 5న తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. ప్రగతి భవన్ లో ఉదయం 10:30 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఈ సమావేశంలో ఆమోదం తెలపనుంది.
ఆస్ట్రేలియా కీలక నిర్ణయం తీసుకుంది. కరెన్సీ నోట్ పై దివంగత క్వీన్ ఎలిజబెత్-2 ఫొటోను తొలగించి కొత్త నోట్లను ముద్రించాలని నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ తో భారీగా నష్ట పోయిన పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు హాంకాంగ్ భారీ ఆఫర్లు ప్రకటిస్తోంది. పర్యాటకులను ఆకర్షించేందుకు హాంకాంగ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5 లక్షల ఉచిత విమాన టికెట్లు అందజేయనుంది.
నేటి నుంచి తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం 12:10 గంటలకు ఉభయ సభలు ప్రారంభవుతాయి. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించునున్నారు.
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయంలో తెల్లవారుజాము 3:30 గంటల ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించింది.
తెలంగాణ శాసన సభ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల సంయుక్త సమావేశంతో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి. రెండేళ్ల అనంతరం బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు.
అల్లూరి జిల్లాలో రైలు ప్రమాదం జరిగింది. శివలింగపురం రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది.
అదానీ గ్రూప్ వ్యవహారంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దృష్టి పెట్టింది. అదానీ సంస్థలకు ఇచ్చిన రుణాలపై వాణిజ్య బ్యాంకులు వివరాలు ఇవ్వాలని ఆదేశించింది.
శ్రీకాకుళం జిల్లా సముద్ర తీరంలో డ్రోన్ కలకలం రేపింది. భావనపాడు సమీపంలో మత్స్యకారులకు డ్రోన్ చిక్కింది.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో ముసలం మొదలైంది. చైర్మన్ కుడుముల సత్యనారాయణ సభ్యత్వంపై ఏడుగురు కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. చైర్మన్ కు వ్యతిరేకంగా ఏడుగురు కౌన్సిలర్లు క్యాంప్ రాజకీయం మొదలు పెట్టారు.
వనస్థలీపురంలోని ఆటో నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. టైర్ల రీ బాటనింగ్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో గోదాంలో ఉన్న టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు.
అదానీ ఎంటర్ ప్రైజెస్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్(ఎఫ్ పీవో)ను రద్దు చేసింది. ప్రస్తుత మార్కెట్ అస్థిరమైన పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులకు వారి పెట్టుబడుల మొత్తాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అదానీ ఎ�
పల్నాడు జిల్లాలోని నరసరావుపేట నియోజకవర్గంలో టీడీపీ నేతపై ప్రత్యర్థులు కాల్పులు జరిపారు. రొంపిచెర్ల మండలం టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కాల్పులు జరిపారు.
జమ్మూకశ్మీర్ లో ప్రముఖ పర్యాటక ప్రాంతం గుల్ మార్గ్ లో గల స్కీ రిసార్ట్ ను భారీ హిమపాతం ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. సుమారు 19 మందిని అధికారులు సురక్షితంగా రక్షించారు.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెంకట్ రావు నగర్ లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
హిజాబ్ వ్యతిరేక ఆందోళనలపై ఇరాన్ ఉక్కుపాదం మోపుతోంది. నిరసనకారులకు మద్దతుగా డ్యాన్స్ చేసిన ఓ జంటకు జైలు శిక్ష విధించడంతోపాటు దేశ బహిష్కరణ చేసింది. టెహ్రాన్ లోని ఆజాదీ స్క్వేర్ లో డ్యాన్స్ చేసిన జంట ఆ తర్వాత ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చ
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబందించిన వార్షిక బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నిర్మలా మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు.
కెనడాలో హిందూ దేవాలయంలపై విద్వేష దాడి జరిగింది. బ్రాంప్టన్ లోని గౌరీ శంకర్ ముందిరంపై గుర్తు తెలియని దుండగులు విద్వేష వ్యాఖ్యలు రాశారు.
వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనంగా మారింది. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందంటూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. ఫోన్ ను ట్యాపింగ్ చేశారని..తన ఫోన్ సంభాషణను దొంగ
వైసీపీలో ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు హీట్ పుట్టిస్తోన్నాయి. ఫోన్ ట్యాపింగ్ జరుగుతోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీసీ అధిష్టానంతో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు.