Home » Author »bheemraj
ఓ గ్రహ శకలం భూమికి అత్యంత సమీపానికి రానుంది. ఇది చరిత్రలోనే తొలిసారి జరుగనుంది. ‘ఆస్టరాయిడ్-2023’ దక్షిణ అమెరికా మీదుగా భూ ఉపరితలానికి 2,200 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.
నంద్యాల జిల్లా బనగానపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పోలీస్ స్టేషన్ ఎదుట తల్లి, కొడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇందులో కొడుకు చనిపోగా తల్లి పరిస్థితి విషమంగా ఉంది.
సింధు నది జలాల ఒప్పందం విషయంలో భారత్, పాకిస్తాన్ మధ్య కొన్నేళ్లుగా విబేధాలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఒప్పందాన్ని సవరించుకుందామంటూ దాయాది పాక్ కు భారత్ నోటీసు ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సినీ నటుడు, ఆలిండియా సమతువ మక్కల్ కచ్చి అధ్యక్షుడు శరత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. దేశ రాజకీయాల గురించి కవితతో శరత్ కుమార్ చర్చించారు.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో మూడు యుద్ధ విమానాల ప్రమాద ఘటనపై అంతర్గత విచారణకు భారత వాయుసేన ఆదేశించింది. గంటల వ్యవధిలోనే మూడు విమానాలు కూలిన ఘటనపై వాయుసేన ఉన్నతాధికారులకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేసి వివరాలను తెలుసుకున్నారు.
రాజస్థాన్ రాష్ట్రంలోని భరత్ పూర్ లో చార్టెడ్ విమానం కుప్ప కూలిపోయింది. సాంకేతిక లోపం కారణంగానే చార్టెడ్ విమానం కుప్ప కూలిందని అనుమానిస్తున్నారు. విమానం కూలిన స్థలానికి అధికారులు, పోలీసులు హుటాహుటిన తరలి వచ్చారు.
మామూలుగా మన ఆయుష్షు మన చేతుల్లో ఉండదు. కానీ, ఇప్పుడు మనిషి ఆయుష్షును పెంచుకోవచ్చు. తాజాగా బ్రిటన్ లోని బ్రిస్టల్ యూనివర్సిటీ, ఇటీలిలోని మల్టీమెడికా గ్రూప్ పరిశోధకులు ఆ రహస్యాన్ని ఛేదించారు.
తిరుమలలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏడు వాహనాలపై మలయప్పస్వామి వివహరించనున్నారు. ఉదయం సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి విహరించారు.
పాకిస్తాన్ లోని కరాచీలో అంతు చిక్కని వ్యాధితో 18 మంది మృతి చెందారు. వీరిలో ఎక్కువగా పిల్లలు ఉన్నారు. కరాచీలోని కెమరి వద్ద తీర ప్రాంతంలో ఉన్న గోత్ గ్రామంలో ఈ నెల 10 నుంచి 25 మధ్య 18 మంది వింత వ్యాధితో మృతి చెందారు.
ఇజ్రాయెల్ లో కాల్పులు కలకలం రేపాయి. జెరూసలెంలోని ప్రార్థనామందిరంలో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
నటుడు తారకరత్న అస్వస్థతకు గురికావడంతో మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించారు. రాత్రి పొద్దుపోయాక ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరుకు కుటుంబ సభ్యులు తరలించారు. నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు.
గుజరాత్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సూరత్ లోని కార్ల షో రూమ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకున్నారు. ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.
ఒక కార్గో షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో నౌకలో ప్రయాణిస్తున్న 8 మంది మృతి చెందారు. జపాన్, దక్షిణ కొరియా మధ్య సముద్రంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
విమానంలో ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రసవించింది. ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తున్న మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 19న గర్భిణీ అయిన మహిళ టోక్యో సమీపంలోని సరిటా నుంచి దుబాయ్ కు ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తోంది.
టీచర్ల దంపతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల దంపతుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఆధ్వర్యంలో రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా మంత్రులు, అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కాలేదు.
ప్రకాశం జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. నిన్న ఒంగోలులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వివాహం చేసుకున్న అజయ్, గౌతమి రక్షణ కల్పించాలని కో
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకుంటే జనం తిరగబడతారని జోస్యం చెప్పారు. యువగళంతో యువతకు భవిష్యత్ ఉండబోతుందన్నారు.
భారత్ లో తొలి కరోనా ఇంట్రానాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్ ను రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా, సైన్స్ అండ్ టెక్నాలజీ జితేందర్ సింగ్ ఆవిష్కరించారు.
తెలంగాణ సర్కార్ పై మరోసారి గవర్నర్ తమిళిసై విమర్శలు చేశారు. రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించిన తీరుపై పుదుచ్చేరిలో విమర్శలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని మండిపడ్డారు.