Inter-Caste Married Couple : కులాంతర వివాహం.. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

ప్రకాశం జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. నిన్న ఒంగోలులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వివాహం చేసుకున్న అజయ్, గౌతమి రక్షణ కల్పించాలని కోరుతూ ఒంగోలు తాలుకా పోలీసులను ఆశ్రయించారు.

Inter-Caste Married Couple : కులాంతర వివాహం.. పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

inter-caste

Updated On : January 26, 2023 / 7:44 PM IST

Inter-Caste Married Couple : ప్రకాశం జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. నిన్న ఒంగోలులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వివాహం చేసుకున్న అజయ్, గౌతమి రక్షణ కల్పించాలని కోరుతూ ఒంగోలు తాలుకా పోలీసులను ఆశ్రయించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలుకు చెందిన 19 ఏళ్ల గౌతమికి, ఒంగోలు మండలం మంగళాద్రిపురానికి చెందిన 22 ఏళ్ల అజయ్ తో ఇన్ స్టామ్ గ్రామ్ పరిచయం ఏర్పడింది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిధ్దరు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని.. గత నవంబర్ లో పెళ్లి చేసుకోగా గౌతమి కుటుంబ సభ్యులు ఇద్దరిపై దాడి చేసి తీసుకెళ్లారని చెబుతున్నారు.

Two Girls Love: యువతుల మధ్య ప్రేమ.. రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించిన జంట!

మరోసారి ఇంటి నుంచి వచ్చేసిన గౌతమి, అజయ్ నిన్న ఒంగోలులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ప్రేమ జంట ఒంగోలు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు కులాలు వేర్వేరు కావడంతో తమ కుటుంబ సభ్యులు తమను చంపేస్తామని బెదరిస్తున్నారని చెప్పారు. తమకు రక్షణ కల్పించాలని కోరారు.