Home » Author »bheemraj
ఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ నెల 28 నుంచి పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు. గతంలో షర్మిల ప్రారంభించిన పాదయాత్రకు మధ్యలో బ్రేక్ పడింది. ఇప్పుడు మళ్లీ పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల విభాగంలో నలుగురు ఉద్యోగులపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. మీడియాలో వచ్చిన కథనాలు, వ్యక్తిగతంగా ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ కమిటీ మేరకు సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచార రథం వారాహికి పవన్ పూజలు చేశారు.
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరి
నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది.
తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం కానుంది.
మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.
నేడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లాలోని కొండగట్టుకు వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు పవన్ కొండగట్టుకు చేరుకోనున్నారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి జనసేనాని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.
విశాఖలో తండ్రిపై బాలిక కత్తితో దాడి చేసిన కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ప్రియుడు, అతడి తల్లి చెప్పడంతోనే తన తండ్రిపై దాడి చేశానని బాలిక పోలీసులకు చెప్పారు.
హైదరాబాద్ పాతబస్తీలో రౌడీ షీటర్లు రెచ్చి పోతున్నారు. మాట వినని వారిపై రోడ్లపై వెంటాడి దాడులు చేస్తున్నారు. చంద్రాయన్ గుట్టలతో రౌడీ షీటర్ల ఆగడాలు మరీ పెరిగిపోయాయి.
తాలిబన్లకు ఐక్యరాజ్య సమితి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. మహిళలపై విధిస్తున్న ఆంక్షలతో ప్రపంచ వేదికపై ఆఫ్ఘనిస్తాన్ ఏకాకిగా మిగిలిపోయే ప్రమాదముుందని హెచ్చరించింది. ఇటీవల అఫ్ఘాన్ లో పర్యటించిన ఐక్యరాజ్య సమితి ప్రతినిధి బృందం అక్కడి పరిస్�
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్రపై పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు పాదయాత్రకు పోలీసుల నుంచి అనుమతి రాకపోయినా.. పాదయాత్రపై తాము తగ్గేదేలే అని టీడీపీ అంటోంది.
ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఫుల్ డ్రస్ రిహార్సల్స్ జరుగుతోంది. కర్తవ్యపథ్ లో శకటాల ప్రదర్శన, త్రివిధ దళాల విన్యాసాలు కనువిందు చేస్తున్నాయి. రిహార్సర్స్ లో ఆంధ్రప్రదేశ్ శకటం సందడి చేస్తోంది.
మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. అది కూడా ఒక్క రోజు బంద్ కాకుండా నడుస్తోంది. ఓ ఉపాధ్యాయుడు ప్రతి రోజు 12 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థికి చదువు చెబుతున్నారు.
హైదరాబాద్ మెట్రో రైలును సాంకేతిక సమస్యలు వీడటం లేదు. టెక్నికల్ సమస్యతో మెట్రో రైలు నిలిచిపోయింది. మెట్రో రైలును సిబ్బంది ఎర్రమంజిల్ స్టేషన్ లో ఆపేసి ప్రయాణికులను దింపేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. మంగళవారం అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.