Pawan Jagityala Tour : పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. మంగళవారం అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

Pawan Jagityala Tour : పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన.. రూట్ మ్యాప్ విడుదల

PAWAN (1)

Updated On : January 23, 2023 / 10:36 AM IST

Pawan Jagityala Tour : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా పర్యటన రూట్ మ్యాప్ విడుదలైంది. రేపు పవన్ కల్యాణ్ కొండగట్టుకు వెళ్లనున్నారు. మంగళవారం జనవరి24న ఉదయం 11 గంటలకు కొండగట్టు చేరుకుంటారు. అంజన్న ఆలయంలో ప్రచార రథం వారాహికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు చేస్తారు. పూజలు పూర్తయ్యాక రేపు మధ్యాహ్నం 2 గంటలకు నాచుపల్లి శివారులోని రిసార్టులో జనసేన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ పాల్గొననున్నారు.

రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన అనుసరించే వ్యూహం, చేపట్టబోయే కార్యక్రమాలపై పార్టీ నేతలతో చర్చించి దిశానిర్ధేశం చేస్తారు. నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రను పవన్ ప్రారంభించనున్నారు. కొండగట్టులో పూజలు, నాచుపల్లిలో పార్టీ నేతలతో మీటింగ్ తర్వాత అదే రోజున నారసింహ యాత్రను పవన్ ప్రారంభించనున్నారు.

Pawan Kalyan Varahi : కొత్త ఏడాదిలో వారాహికి ప్రత్యేక పూజలు.. ముహూర్తం, ప్లేస్ ఫిక్స్ చేసిన పవన్ కల్యాణ్

32 నారసింహ క్షేత్రాల సందర్శన యాత్రలో భాగంగా సాయంత్రం 4 గంటలకు ధర్మపురి లక్ష్మీనారసింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీకారం చుట్టనున్నారు. ఆ తర్వాత మిగిలిన 31 నారసింహ క్షేత్రాలను పవన్ కల్యాణ్ సందర్శిస్తారు. ధర్మపురిలో రేపు సాయంత్రం 5 గంటలకు జనసేన కార్యదర్శులతో పవన్ సమావేశం కానున్నారు.