Medchal Gun Firing : మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకులతో బెదిరించి మద్యం షాపులో రూ.2లక్షలు చోరీ

మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు.

Medchal Gun Firing : మేడ్చల్ జిల్లాలో కాల్పుల కలకలం.. తుపాకులతో బెదిరించి మద్యం షాపులో రూ.2లక్షలు చోరీ

FIRING (1)

Updated On : January 24, 2023 / 8:33 AM IST

Medchal gun firing : మేడ్చల్ జిల్లాలోని శామిర్ పేటలో కాల్పులు కలకలం రేపాయి. మూడుచింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో మద్యం దుకాణం వద్ద దుండగులు కాల్పులు జరిపారు. గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తుపాకులతో బెదిరించి రూ.2లక్షలు చోరీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని మద్యం దుకాణం వద్దకు రాత్రి మాస్క్ లు ధరించి ముగ్గురు దుండగులు వచ్చారు.

క్యాషియర్ తో పాటు మరో ఇద్దరిపై కర్రలతో దాడి చేశారు. తుపాకీతో బెదిరించి రూ.2 లక్షలను దుండగులు చోరీ చేశారు. మద్యం దుకాణం సిబ్బంది తిరగడబటంతో తుపాకీతో దుండగులు కాల్పులు జరిపారు. సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో తుపాకీ తూటా షట్టర్ కు తగిలింది. ఆ తర్వాత డబ్బులతో దుండగులు పరారవుతుండగా సిబ్బంది పెద్దగా కేకలు వేశారు.

Viral Video: పట్టపగలు నడిరోడ్డుపై తుపాకీతో బెదిరించి మహిళ, బాలుడి నుంచి గొలుసు, స్మార్ట్‌ఫోన్ చోరీ

నిందితులు పారిపోతూ గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. మద్యం దుకాణం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.