Students Missing Nellore : నెల్లూరు జిల్లాలో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినులు మిస్సింగ్

నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Students Missing Nellore : నెల్లూరు జిల్లాలో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినులు మిస్సింగ్

students missing

Updated On : January 24, 2023 / 1:12 PM IST

Students Missing Nellore : నెల్లూరు జిల్లా రావూరులో ముగ్గురు టెన్త్ క్లాస్ విద్యార్థినుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. ఎస్సీ, ఎస్టీ గురుకుల నుంచి ముగ్గురు విద్యార్థినులు మిస్ అయ్యారు. కనిపించుకుండా పోయిన వారిని జ్యోతి, నాగమణి, అంకితగా గుర్తించారు. వారు రాపూరు, కల్వాయి, పొదలుకూరుకు చెందిన వారుగా తెలుస్తోంది.

రాత్రి హాజరు తీసుకునే సమయంలో విద్యార్థినులు మిస్సైనట్లు సిబ్బంది గుర్తించారు. విద్యార్థినులు మిస్సైన వెంటనే ఉపాధ్యాయులంతా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మిస్సైన విద్యార్థినుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. విద్యార్థినుల కుటుంబ సభ్యులకు కూడా మెసేజ్ లు పంపారు. దీంతో వారి కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుంటున్నారు.

Tirupati Students Missing : తిరుపతిలో పదో తరగతి విద్యార్థుల మిస్సింగ్ కలకలం.. ఇంకా లభించని ఆ ఐదుగురి ఆచూకీ

అయితే, ఎస్సీ ఎస్టీ గురుకులంలో సుమారు 200 మంది విద్యార్థినులు చదువుతున్నారు. అలాగే ఆరో తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా ఉన్నారు. అయితే నిన్న సాయంత్రం అటెండెన్స్ తీసుకుంటున్న క్రమంలో ఈ ముగ్గురు విద్యార్థినుల ఆచూకీ తెలియలేదు. దీంతో వారి స్నేహితులను విచారించారు. ఆ తర్వాత వారు అదృశ్యమవ్వడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.