YS Sharmila : వివేకా హత్య కేసు విచారణపై స్పందించిన వైఎస్ షర్మిల

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.

YS Sharmila : వివేకా హత్య కేసు విచారణపై స్పందించిన వైఎస్ షర్మిల

YS Sharmila (1)

Updated On : January 24, 2023 / 5:39 PM IST

YS Sharmila : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. వైఎస్ వివేకానందరెడ్డి వంటి ముఖ్యమైన వ్యక్తి హత్య కేసు విచారణ సంవత్సరాలు పడితే సాధారణ ప్రజల కేసుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో ఆలస్యంపై ఆమె మండిపడ్డారు. ఇలా విచారణ ఆలస్యమైతే సీబీఐపై నమ్మకం ఉంటుందా అని అన్నారు. ఇప్పటికైనా కేసులో నిజా నిజాలు తేల్చాలని డిమాండ్ చేశారు. దోషులను పట్టుకుని శిక్షించాలన్నారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన ఫైళ్లు హైదరబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ అయ్యాయి. కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరబాద్ సీబీఐ కోర్టుకు ఫైల్స్ చేరాయి. వివేక హత్య కేసుకు సంబంధించి మూడు బాక్సుల్లో చార్జిషీట్లు, సాక్షుల వాంగ్ములం, ఫైల్స్ తరలించబడ్డాయి. కాగా వివేకా హత్యకు సంబంధించి కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు ఉన్నాయి. వివేకా హత్య కేసు విచారణను తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫైల్స్ తో పాటు ఇతర సంబంధిత వాంగ్ములాలతో పాటు అన్ని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు బదిలీ చేయబడ్డాయి.

విచారణను ఏపీ నుంచి తెలంగాణకు బదిలీ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు ఫైళ్లు, చార్జిషీటు పత్రాలు, సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక డాక్యుమెంట్లు నేడు హైదరాబాద్ లోని సీబీఐ కోర్టుకు చేరుకున్నాయి. వీటిని ఇవాళ కడప జిల్లా సెషన్స్ కోర్టు నుంచి హైదరాబాద్ తరలించారు. మూడు పెట్టెల్లో వీటిని హైదరాబాద్ సీబీఐ కోర్టుకు తీసుకువచ్చారు. వివేకా హత్య కేసును విచారిస్తున్న సీబీఐ కడప కోర్టులో ఐదుగురు నిందితులపై రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. ఇప్పుడవన్నీ బదిలీ అయిన క్రమంలో హైదరాబాదులోని సీబీఐ న్యాయస్థానం త్వరలోనే వివేకా హత్య కేసు విచారణను ప్రారంభించనుంది.

YS Viveka Murder Case : వివేక హత్య కేసులో 17వ రోజు సీబీఐ విచారణ

మరోవైపు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు ఇవ్వడంపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ హైదరాబాద్ లో విచారణకు రావాలని నిన్న సీబీఐ నోటీసులు ఇచ్చింది. దీనిపై ఎంపీ అవినాష్ రెడ్డి స్పందిస్తూ.. ఒక రోజు ముందుగా నోటీసులు పంపారని తెలిపారు. ఇవాళ వేరే కార్యక్రమాలను ముందుగానే అరెంజ్ చేసుకున్నామని లేఖలో పేర్కొన్నారు. ఐదు రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా దర్యాప్తుకు వస్తానని చెప్పారు.

దర్యాప్తుకు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని అన్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణను సీబీఐ వేగవంతం చేసింది. అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర లేకపోవడంతో వాట్సాప్ ద్వారా నిన్న నోటీసులు పంపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు కుట్ర కోణంలో భాగంగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిలను విచారణకు హాజరు కావాలని, ఈరోజు హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు హాజరు కావాలని వాట్సాప్ ద్వారా ఆయనకు అధికారులు నోటీసులు జారీ చేశారు.

Supreme Court Judgment : వివేకా హత్య కేసు.. గంగిరెడ్డి బెయిల్ రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

అంతేకాకుండా ఆయన పర్సనల్ సెక్రటరీ సైతం కూడా హార్డ్ కాపీని అందజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి..ఒక్కరోజు ముందు ఈ సమాచారం ఇవ్వడంతో విచారణకు హాజరు కావడానికి వీలు కావడం లేదన్నారు. తాను ప్రజా ప్రతినిధిగా అనేక కార్యక్రమాలకు షెడ్యూల్ చేసుకుని ఉన్నాను.. కాబట్టి ఆ కార్యక్రమాలు చూసుకున్నాక ఐదు రోజుల తర్వాత ఎక్కడికి పిలిచినా వస్తానని చెప్పారు. విచారణకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తానని సీబీఐకి లేఖ రాశారు.