451 Prisoners Missing : మహారాష్ట్రలో 451 ఖైదీలు మిస్సింగ్.. కరోనా విజృంభణ సమయంలో పెరోల్ పై విడుదల

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు.

451 Prisoners Missing : మహారాష్ట్రలో 451 ఖైదీలు మిస్సింగ్.. కరోనా విజృంభణ సమయంలో పెరోల్ పై విడుదల

prisoners missing

Updated On : January 24, 2023 / 2:02 PM IST

451 Prisoners Missing : మహారాష్ట్రలో కరోనా మహమ్మారి సమయంలో జైళ్ల నుంచి పెరోల్ పై విడుదలైన ఖైదీల్లో 451 ఖైదీలు అదృశ్యమయ్యారు. కరోనా మహమ్మారి సమయంలో కోర్టు ఆదేశాలతో అనేక మంది ఖైదీలను జైలు నుంచి అధికారులు విడుదల చేశారు. ఇందులో చాలా మంది పెరోల్ గుడువు ముగిసినా ఇంకా తిరిగి జైలుకు రాలేదు. ఇదే అదునుగా భావించిన ఖైదీలు పరారయ్యారు. ఈ క్రమంలో 451 మంది ఖైదీలు అదృశ్యమయ్యారు. వీరిలో 357 మంది ఖైదీలపై పోలీసులు కేసు నమోదు చేశారు. వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

కరోనా సమయంలో ఏడేళ్లు లేదా అంతకంటే తక్కువ శిక్ష పడిన ఖైదీలను పెరోల్ పై విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసుల సమచారం ప్రకారం.. మార్చి 2020 వరకు మహారాష్ట్రలోని జైళ్లలో దాదాపు 35 వేల మంది ఖైదీలు ఉన్నారు. అయితే, మిస్ అయిన ఖైదీలు ప్రస్తుతం వారంతా ఎక్కడ తలదాచుకున్నారన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

Prisoners escape : జైల్లో రద్దీ తగ్గుతుందని పెరోల్​ ఇస్తే..3,000 మంది ఖైదీలు ఎస్కేప్

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో జైళ్లలో పెద్ద సంఖ్యలో ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో ఖైదీల భద్రత, సామాజిక దూరాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్, పెరోల్ పై అండర్ ట్రయల్ సహా కొంత మంది ఖైదీలను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఖైదీలను విడుదల చేశారు. ఈ క్రమంలో అనేక మంది ఖైదీలు అదృశ్యమయ్యారు.