Notices Govt Employees Union : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.

Notices Govt Employees Union : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి నోటీసులు

notices

Updated On : January 23, 2023 / 4:26 PM IST

Notices Govt Employees Union : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో 7 రోజుల్లో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. సమస్యలపై ఇటీవల ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. వేతనాలు, ఆర్థిక ప్రయోజనాలపై తమను సంప్రదించే ఇతర మార్గాలున్నా.. గవర్నర్ ను ఎందుకు కలిశారని ప్రభుత్వం ప్రశ్నించింది. రోసా రూల్స్ ఉల్లంఘించినందుకు గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో స్పష్టంగా పేర్కొంది. ఉద్యోగులు రోసా రూల్స్ ఉల్లంఘించారని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించడం లేదని, తమకు రావాల్సిన బకాయిలు ఇవ్వడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయుకులు సూర్యనారాయణతోపాటు మరికొందరు ఇటీవల గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా తాము దాచుకున్న డబ్బులను కూడా ప్రభుత్వం వాడుకుందని పేర్కొన్నారు. సకాలంలో జీతాలు చెల్లించాలని.. అందుకుగానూ తగిన చర్యలు తీసుకోవాలని ఆ దిశగా ప్రభుత్వాన్ని డైరెక్షన్ చేయాలని గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

Andhra pradesh : ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల తిప్పలు.. రావాల్సిన బకాయిల కోసం గవర్నర్‌ను కలిసి ఉద్యోగుల సంఘాల నేతలు

దీంతో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి
మంత్రులు కూడా ప్రభుత్వ ఉద్యోగుల సంఘంపై ఫైర్ అయ్యారు. ఏపీఎన్ జీవో అధ్యక్షులు బండి శ్రీనివాస్ కూడా సూర్యనారాయణపై చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. వీటన్నింటిని బేస్ చేసుకుని ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో ఏడు రోజుల్లో చెప్పాలని పేర్కొంది.