Govt School One Student : ఆ స్కూల్ లో ఒకే ఒక్క విద్యార్థి.. 12 కిమీ దూరం నుంచి వచ్చి చదువు చెబుతున్న టీచర్

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. అది కూడా ఒక్క రోజు బంద్ కాకుండా నడుస్తోంది. ఓ ఉపాధ్యాయుడు ప్రతి రోజు 12 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థికి చదువు చెబుతున్నారు.

Govt School One Student : ఆ స్కూల్ లో ఒకే ఒక్క విద్యార్థి.. 12 కిమీ దూరం నుంచి వచ్చి చదువు చెబుతున్న టీచర్

ONE STUDENT

Updated On : January 23, 2023 / 11:28 AM IST

Govt School One Student : ఒకప్పుడు ప్రభుత్వ పాఠశాలు విద్యార్థులతో కళళలాడేవి.. ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోవడంతో ఇప్పుడు వెలవెలబోతున్నాయి. విద్యార్థులు తగ్గిపోవడంతో పలు ప్రభుత్వ స్కూల్స్ మూతపడ్డాయి. పలు స్కూల్స్ లో విద్యార్థులున్నా.. టీచర్ల కొరత ఉంది. కొన్ని పాఠశాల్లో ఒక్క ఉపాధ్యాయుడే బోధిస్తున్నారు. కానీ అక్కడ కేవలం ఒకే ఒక విద్యార్థి కోసం పాఠశాలను నడిపిస్తున్నారు.

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ ప్రభుత్వ పాఠశాల కేవలం ఒక్క విద్యార్థి కోసమే నడుస్తోంది. అది కూడా ఒక్క రోజు బంద్ కాకుండా నడుస్తోంది. అతనికి చదువు చెప్పడం కోసం ఓ ఉపాధ్యాయుడు ప్రతి రోజు 12 కిలో మీటర్ల దూరం నుంచి వచ్చి విద్యార్థికి చదువు చెబుతున్నారు. వాషిమ్ జిల్లాలోని గణేష్ పూర్ లో 150 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. గ్రామంలో జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.

Government Teacher : హ్యాట్సాఫ్ టీచర్.. పిల్లలను బడికి రప్పించేందుకు ప్రభుత్వ స్కూల్ టీచర్ సూపర్ ఐడియా

అందులో 1వ తరగతి నుంచి 4వ తరగతి వరకు బోధిస్తున్నారు. అయితే ఆ స్కూల్ లో కార్తిక్ షెగ్ కర్ అనే విద్యార్థి మాత్రమే చదువుకుంటున్నారు. ఒక్క విద్యార్థే ఉన్నాడని స్కూల్ ను ఇతర ప్రాంతాలకు తరలించకుండా కేవలం అతని కోసమే జిల్లా యంత్రాంగం ఆ స్కూల్ ను నడిపిస్తోంది. అంతేకాకుండా బాలుడికి మధ్యాహ్న భోజనంతోపాటు అన్ని వసతులు కల్పిస్తోంది.

స్కూల్ లో కిశోర్ మన్కర్ అనే వ్యక్తి టీచర్ గా పని చేస్తున్నారు. తానే అతనికి అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నానని ఉపాధ్యాయుడు కిశోర్ తెలిపారు. కార్తిక్ ప్రతి రోజు స్కూల్ కు వస్తాడని, ఇద్దరం కలిసి ఉదయాన్నే ప్రార్థన చేస్తామని చెప్పారు. అతని కోసం పాఠశాలలో అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. రెండేళ్ల నుంచి అతను ఒక్కడే స్కూల్ లో పేరు నమోదు చేసుకుంటున్నాడని తెలిపారు.