Minister Botsa Comments : రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు
ఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Minister Botsa
Minister Botsa Comments : ఓ వైపు ఏపీ రాజధాని అంశంపై విపక్షాలు విరుచుకుపడుతుంటే మంత్రులు మాత్రం విశాఖ నుంచి త్వరలో పాలన ప్రారంభవుతుందంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. రాజధాని విశాఖకు మార్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉగాదికి విశాఖ నుంచి పరిపాలన చేయాలని జగన్ ను అడుగుతున్నామని అన్నారు. ఈ విషయంపై సీఎం జగన్ సానుకూలంగా స్పందించబోతున్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ తమ మాటలు వింటారని అనుకుంటున్నామన్నారు. విశాఖ నుంచి పరిపాలన రాజధాని కావాలనేదే తమ కోరిక అని తెలిపారు.
ఇక ఉగాదికి పాలన రాజధానిగా విశాఖ అంటూ సీఎం సానుకూలంగా స్పందించారని పేర్కొన్నారు. మరోవైపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాబోయే తరానికి పవన్ ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. కేఏ పాల్, పవన్ కి ఏం తేడా లేదన్నారు. పవన్ ఆవేశపడి మాట్లాడినంత మాత్రాన ఒరిగేదేమీ లేదని ఎద్దేవా చేశారు.
తాము మూడు రాష్ట్రాలని అనలేదు.. 3 రాజధానులు అని మాత్రమే అని అన్నామని గుర్తు చేశారు. మూడు రాజధానుల ఏర్పాటే వైసీసీ విధానమన్నారు. తమ పార్టీ విధానం వికేంద్రీకరణేనని స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.పవన్ ఎవరిని బెదిరస్తారు..ఎవరిని కొడతారు అని అడిగారు. పవన్ కల్యాణ్ వి సన్నాసి మాటలని మండిపడ్డారు.
ఏపీ రాజధాని అంశంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. శివరామకృష్ణ కమిటీ సిఫార్సులు అమలు చేయాలంటూ పిటీషన్ దాఖలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన మస్తాన్ వలీ పిటిషన్ వేశారు. ఇప్పటికే అమరావతి రాజధాని అంశంపై హైకోర్టు తీర్పుపై అమరావతి రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు.
Minister Botsa On AP Capital : 2-3 నెలల్లోనే.. ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు
జనవరి31న అమరావతి రాజధాని కేసును సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ క్రమంలో వస్తాన్ వలీ దాఖలు చేసిన పిటిషన్ తో పాటు అమరావతి రాజధాని కేసును కూడా సుప్రీంకోర్టు విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకే చోట అభివృద్ధి కాకుండా అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలని శివ రామకృష్ణ కమిటీ సూచించిన విషయం తెలిసిందే.