Minister Botsa On AP Capital : 2-3 నెలల్లోనే.. ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని ఆయన అన్నారు.

Minister Botsa On AP Capital : 2-3 నెలల్లోనే.. ఏపీ రాజధానిపై మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Minister Botsa On AP Capital : ఏపీ రాజధాని అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు మూడు నెలల్లో ఆంధ్రప్రదేశ్ కు విశాఖ పరిపాలన రాజధాని కాబోతోందని ఆయన అన్నారు. విశాఖను ఏపీ పరిపాలన రాజధాని చేయడం వైసీపీ ప్రభుత్వం విధానం అని మంత్రి బొత్స మరోసారి తేల్చి చెప్పారు. గతేడాదికంటే కొత్త ఏడాదిలో మరింత అభివృద్ధి జరగాలని ఆకాంక్షించిన మంత్రి బొత్స.. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఫిబ్రవరిలోగా శంకుస్థాపన చేస్తామన్నారు.

రాష్ట్ర రాజధానిపై మరోసారి బొత్స కీలక వ్యాఖ్యలు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి బొత్స పరిపాలన రాజధాని గురించి ఈ కామెంట్స్ చేశారు. ప్రజల ఆకాంక్ష నెరవేరాలని ఆయన కోరుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం విధానంగా పరిపాలన రాజధాని విశాఖకు వస్తుందన్నారు. రాబోయే 2,3 నెలల్లో విశాఖకు పరిపాలన రాజధాని వస్తుందన్నారు. ముఖ్యమంత్రి కూడా విశాఖకు షిఫ్ట్ అవుతారు అని మంత్రి బొత్స చెప్పారు.

ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష మేరకు త్వరలోనే విశాఖ నుంచే సీఎం జగన్ పరిపాలన సాగిస్తారని.. రెండు, మూడు నెలల్లోనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందని మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటికే రాజధాని అంశంపై రాష్ట్ర రాజకీయాల్లో హాట్ గా చర్చ జరుగుతోంది. ఏపీకి ఒక్కటే రాజధాని అది అమరావతే అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అంటుంటే.. ఒకటి కాదు మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతాం అని ప్రభుత్వం చెబుతోంది.