Minister Botsa Satyanarayana: అమరావతికి వ్యతిరేకం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నాం..

రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.

Minister Botsa Satyanarayana: అమరావతికి వ్యతిరేకం కాదు.. రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నాం..

Minister Botsa Satyanarayana

Updated On : September 25, 2022 / 3:38 PM IST

Minister Botsa Satyanarayana: రాష్ట్ర ప్రయోజనాలకోసమే విశాఖ పట్టణాన్ని పరిపాలనా రాజధానిగా చేస్తున్నామని, వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకం కాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీలో పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు మేధావులు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చారు. విశాఖను పరిపాలన రాజధానిగా అందరూ కోరుకుంటున్నారని అన్నారు. విశాఖ రాజధానిగా వస్తే ఉద్యోగాలు వస్తాయని, పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు.

Police Protection For Amaravati Farmers : అమరావతి రైతుల‌కు ర‌క్ష‌ణ‌గా 400మంది పోలీసులు.. గుడివాడలో కట్టుదిట్టమైన భద్రత

అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనని తెలిపారు. 29 గ్రామాలకోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని బొత్స పేర్కొన్నాడు. అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమవకూడదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తున్నామని బొత్స అన్నారు. శ్రీబాగ్ ఒప్పందం మేరకు కర్నూలును న్యాయ రాజధానిగా చేస్తున్నామని తెలిపారు.

Amaravati Farmers Maha Padayatra : అమరావతి రైతులకు రూ.5లక్షలు.. పాదయాత్రకు సాయంగా మాజీమంత్రి విరాళం

టాప్ -5 సిటీస్ లో విశాఖ ఉందని, విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. 3 రాజధానులపై అసెంబ్లీలో సీఎం జగన్మోహణ్ రెడ్డి స్పష్టం గా చెప్పారని బొత్స అన్నారు. అమరావతికి మా ప్రభుత్వం వ్యతిరేకం కాదని, వికేంద్రీకరణతోనే రాష్ట్రమంతా అభివృద్ధి అని బొత్స పేర్కొన్నాడు.