Home » Author »bheemraj
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు తమ పరిధిలోకి రాదని హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.
దేశంలో ప్రతిష్టాత్మక సాంకేతిక విద్యా సంస్థలో ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్ 1 ఫలితాలు విడుదలయ్యాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను సీఎం క్యాంప్ కార్యాలయంలో విశాఖపట్నానికి చెందిన చదరంగ క్రీడాకారిణి చిన్నారి కోలగట్ల అలన మీనాక్షి కలిశారు. సీఎం వైఎస్ జగన్ మీనాక్షిని ప్రత్యేకంగా అభినందించారు.
మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్టులో పోలీసులకు చుక్కెదురైంది. పోలీసుల రిమాండ్ పిటీషన్ ను న్యాయమూర్తి తిరస్కరించారు. విచారణ అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై రవీంద్రను న్యాయమూర్తి విడుదల చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల అంశంపై సుప్రీంకోర్టు తీర్పు కీలకం కానుంది. ఈ కేసును త్వరగా విచారించాలని కోరుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి లేఖ రాసింది.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియా దేశాలు అల్లకల్లోలమయ్యాయి. రెండు దేశాల్లో అంతులేని విషాదం నెలకొంది. టర్కీ, సిరియాలో వరుస భూకంపాలు సంభవించాయి. ఈ రెండు దేశాల సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం పెను విలయం సృష్టించింది.
సౌర వ్యవస్థలో అతి పెద్దదైన గురు గ్రహం గురించి ఖగోళ శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.
ఇవాళ దేశీయ మార్కెట్లు నష్టాలతో కొనసాగుతున్నాయి. నిఫ్టీ దాదాపు 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక మార్కెట్లలో అదానీ గ్రూప్ షేర్ల పతనం కొనసాగుతోంది.
టర్కీలో ప్రకృతి బీభత్సం సృష్టించింది. పెను భూకంప టర్కీని కుదిపేసింది. తెల్లవారుజాము 4:17 గంటలకు భూకంపం సంభవించింది. దీంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఈ విలయంలో ఇప్పటికే 200 మందికిపైగా మరణించారు.
తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడే బీజేపీ ఎమ్మెల్యే ఈ టల రాజేందర్ అన్నారు. 70-80 శాతం నిధులు విదుదల కావన్నారు.
బంగ్లాదేశ్ లో హిందూ దేవాలయాలపై తరచూ దాడులకు జరుగుతున్నాయి. దేవతామూర్తుల విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా మరో 12 దేవాలయాలపై దాడులకు పాల్పడి దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణకు లైన్ క్లియర్ అయింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక తీర్పు వెలువరించింది.
తెలంగాణ అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో తెలంగాణ 2023-24 వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని మంత్రి హరీష్ రావు అన్నారు. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం భారీ బడ్జెట్ కు రెడీ అయింది. 2023-24 ఆర్థిక సంవత్సారానికి బడ్జెట్ ను ఇవాళ బీఆర్ఎస్ సర్కార్ అసెంబ్లీ ముందు ఉంచనుంది. ఉదయం 10:30 రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
అమెరికా వీసాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తోన్న భారతీయులకు మన దేశంలోని అమెరికా రాయబార కార్యాలయం గుడ్ న్యూస్ తెలిపింది. వెయిటింగ్ పీరియడ్ ను తగ్గించేందుకు నిబంధనలు మార్చినట్లు వెల్లడించింది.
తెలంగాణ గవర్నర్ తమిళిసై ఇవాళ ఢిల్లీకి వెళ్లారు. తెలంగాణలో నెలకొన్న పరిస్థితులను ఆమె కేంద్ర పెద్దలకు వివరించే అవకాశం ఉంది.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజాలు బయటపడే రోజు దగ్గర పడిందన్నారు. సమాచారం ఉంటేనే ఎవరైనా విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.
తెలంగాణ ఐఏఎస్ లకు అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. ఎన్నికల కోసమే ఐఏఎస్, ఐపీఎస్ లను బదిలీ చేశారని ఆరోపించారు. తెలంగాణ పోలీస్ శాఖలో కీలక స్థానాల్లో ఏపీ క్యాడర్ వారిని నియమించారనిపేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. ఈ ఫలితాలను ఏపీ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు విడుదల చేసింది. ఫలితాలను ఏపీఎస్ఎల్ పీఆర్ బీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.