Home » Author »bheemraj
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీని మరోసారి టార్గెట్ చేశారు. గన్ మెన్ల తొలగింపుపై కోటంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు గన్ మెన్లను తొలగించారని.. మిగిలిన గన్ మెన్లు కూడా తనకు వద్దన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళలు దుర్మరణం చెందగా, నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు.
నేడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. జనవరి6న శాసన సభలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది.
కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.
ఒకప్పుడు మెదడులో ఏర్పడిన కణితులను గుర్తించాలంటే చాలా క్లిష్టమైన వైద్య పరీక్షలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు మెదడులో కణితులను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
పాకిస్తాన్ లో వికీపిడియాను బ్లాక్ చేశారు. అభ్యంతరకరమైన కంటెంట్ ను తొలగించాలని స్థానిక ప్రభుత్వం వికీపిడియాకు నోటీసులు ఇచ్చింది. వికీపిడియా వెబ్ సైట్ ను పాకిస్తాన్ బ్లాక్ చేసింది.
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేయలేమని తేల్చి చెప్పారు.
టీడీపీ నేత నారా లోకేశ్ యువగళంపై ఏపీ పోలీసులు హత్యాయత్నం కేసు పెట్టారు. బంగారుపాళ్యం ఘటనలో నారా లోకేశ్ సహా పలువురు సీనియర్ నేతలపై హత్యాయత్నంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
జగిత్యాల జిల్లాలో తండ్రీకూతురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయం బావి దగ్గర తండ్రి మృతదేహం కనిపించగా, బావిలో కూతురు మృతదేహం లభ్యమైంది.
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ నల్లమల రిజర్వ్ ఫారెస్ట్ లో అగ్నిప్రమాదం జరిగింది. దోమలపెంట వద్ద శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన మంటలు చెలరేగాయి.
ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పొలికల్ గేమ్ రోజు రోజుకు హీటెక్కుతుంది. కోటంరెడ్డి వర్సెస్ వైసీపీ నేతలుగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి బెదిరింపు కాల్ వచ్చింది.
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
మణిపూర్ లో భూకంపం సంభవించింది. శనివారం ఉదయం 6.14 గంటలకు ఉఖ్రుల్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.0గా నమోదు అయింది.
ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. 50 వేల ఏళ్ల క్రితం కనిపించిన తోకచుక్క మళ్లీ కనిపించింది. ఓ ఆకుపచ్చ తోకచుక్క భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది.
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఈ నెల 12 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు.
ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం ప్రారంభమైంది. ఇవాళ సీఎం జగన్ జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్య అందించనున్నారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. నూతన సచివాలయ అగ్నిప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా దృష్టి పెట్టాలన్నారు.
మహారాష్ట్రలోని హింగోలి జిల్లాలో వెయ్యి ఏళ్ల నాటి జైనుల ఆరాధ్య దైవం కుంతునాథ్ రాతి విగ్రహం లభ్యం అయింది. జైన మతం ప్రకారం.. 24 జైన తీర్థంకరుల్లో కుంతునాథ్ ను 17వ తీర్థంకరుడిగా చెబుతారు.