Supreme Court Judges Appoint : సుప్రీంకోర్టుకు ఐదుగురు న్యాయమూర్తులు నియామకం!
సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

Supreme Court
Supreme Court Judges Appoint : సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల ఖాళీ పోస్టులను కేంద్ర ప్రభుత్వం భర్తీ చేయనుంది. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘంగా పెండింగ్ లో పెట్టిన వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతోంది.
శుక్రవారం ఇదే అంశంపై విచారించిన జస్టిస్ ఎస్ కే కౌల్, జస్టిస్ ఏఏస్ ఓకాతో కూడిన ధర్మాసనం ఎదుట అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తులను అతి త్వరలో నియమిస్తామని పేర్కొన్నారు.
BBC Documentary: బీబీసీ డాక్యుమెంటరీ వివాదంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇది చాలా సీరియస్ అంశమని, కేంద్ర తీవ్ర కాలయాపన చేయడం సరికాదని పేర్కొంది. న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించే పని చేయరాదని సూచించింది.