Accused Bit SI’s Ear : అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా.. ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు

కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది.

Accused Bit SI’s Ear : అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా.. ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు

POLICE

Updated On : February 5, 2023 / 8:38 AM IST

Accused Bit SI’s Ear : కేరళలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తుండగా అతడు ఎస్ఐ చెవి కొరికాడు. ఈ ఘటన కాసరగాడ్ లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసరగాడ్ లో బైక్ పై వెళ్తున్న స్టెనీ రోడ్రిగ్జ్ అనే వ్యక్తి ఒక వహనాన్ని ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వాహనంలో అతన్ని పోలీసు స్టేషన్ కు తరలిస్తున్నారు. ఎస్ఐ విష్ణుప్రసాద్ పోలీస్ వాహనంలో ముందు సీటులో కూర్చున్నాడు. అయితే వెనుక కూర్చున్న ఆ వ్యక్తి ఒక్కసారిగా ఎస్ ఐ కుడి చెవిని కొరికాడు. దీంతో ఎస్ఐ తీవ్రంగా గాయపడ్డారు.

Bhimavaram : రాష్‌ డ్రైవింగ్‌..ఆపేందుకు యత్నించిన ట్రాఫిక్‌ పోలీసుపై డ్రైవర్ దాడి

చికిత్స కోసం ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. కాగా, రోడ్డుపై ప్రమాదం చేయడంతోపాటు ఎస్ఐ చెవి కొరికిన నిందితుడు స్టెనీ రోడ్రిగ్జ్ ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.