Home » Author »bheemraj
కేంద్రం రాష్ట్రంపై పగబట్టినట్లే వ్యవహరిస్తోందన్నారు. బెంగళూరు మెట్రోకు కేంద్రం నిధులిస్తోందన్నారు. అలాగే చెన్నయ్, లక్నో, వారణాసి, గోరక్ పూర్, గుజరాత్ కు కూడా కేంద్రం నిధులిస్తోందని పేర్కొన్నారు. మెట్రో మొదటి దశ-69కి.మీ, రెండవ దశ-62 కి.మీ విమానా�
ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 298 రెసిడెన్షియల్ స్కూల్స్ లో లక్ష 40 వేల మంది విద్యార్థులు మాత్రమే చదివేవారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. తెలంగాణలో 1004 రెసిడెన్షియల్ స్కూల్స్ లో 5లక్షల31వేల మంది విద్యార్థులు చదువుతున్నారని పేర్కొన్నారు.
టీఎస్ బిపాస్ దేశంలో ఎక్కడా లేదని.. ఒక్క తెలంగాణలోనే ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. 21 రోజుల్లో బిల్డింగ్ పర్మిషన్ ఇస్తున్నామని తెలిపారు.
ఆఫ్రికాలోని గినియా దేశాన్ని వింత వ్యాధి వణికిస్తోంది. కొన్ని రోజులుగా ఈ వ్యాధి పలు ప్రాంతాలకు విస్తరిస్తోంది. ఈ వ్యాధికి గురైన వారిలో ఇప్పటివరకు 8 మంది చనిపోయారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి ఆదివారం (ఫిబ్రవరి12, 2023) ముగియనున్నాయి. చివరి రోజైన నేడు (ఆదివారం) ద్రవ్యి వినిమయ బిల్లు అసెంబ్లీ ముందుకు రానుంది.
భారత్ కు మరో 12 చిరుతలు రానున్నాయి. ఈ నెల 19న కూనో నేషనల్ పార్క్ కు ఇవి చేరుకోనున్నాయి. ఈ మేరకు అటవీశాఖ ఉన్నతాధికారి ఒకరు ప్రకటన చేశారు.
వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ఫిలింనగర్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లోని ప్లాట్ నెంబర్ టూలోని 1007 గజాల స్థలాన్ని నిర్మాత సురేష్ బాబు నుండి 2014 లో లీజుకు తీసుకున్నానని బిజినెస్మెన్ ప్రమోద్ తెలిపారు. 2018 నవంబర్ లో స్థలం అమ్ముతున్నారని తెలిసి 18 కోట్ల రూపాయలకు అగ్రిమెంట్ సేల్ చే�
తెలంగాణలో మరోసారి భారీగా విద్యుత్ డిమాండ్ పెరిగింది. గతేడాదితో పోల్చితే విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో శుక్రవారం (ఫిబ్రవరి 10,2023) కంటే శనివారం (ఫిబ్రవరి 11,2023) అత్యధిక విద్యుత్ ను వినియోగించారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 15 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వ దర్శనం కలుగుతుందని టీడీపీ అధికారులు పేర్కొన్నారు.
విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వాసిత గ్రామాల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు పట్టుడుతుంటే తమకు ఇంకా సమయం కావాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు సెజ్ సమీపంలో భారీ ప్రమాదం జరిగింది. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన ఇంటింటికీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ఓ ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీ చేపట్టిన గ్యాస్ పైప్ లైన్ లో పేలుడు సంభవించింది.
తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం వాయిదా పడింది. మొదట ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సచివాలయ ప్రారంభోత్స కార్యక�
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరును బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఈ మేరకు శనివారం నామినేషన్ వేయాల్సిందిగా బండా ప్రకాశ్ కు సీఎం సూచించారు.
సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడింది. సూర్యుడిపై జరిగిన ఈ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురి చేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోయినట్లు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.
సోషల్ మీడియా యాప్ టిక్ టాక్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం సిబ్బందిని తొలగించింది. జాతీయ భద్రత కారణాలతో 2020లో భారత్ లో నిషేధించబడిన టిక్ టాక్ తాజాగా దేశంలో మొత్తం సిబ్బందిని విధుల నుంచి తొలగించింది.
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. ఈనెల 22 నుంచి 28 వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
హైదరాబాద్ ప్రధాన రహదారుల్లో గుంతలు పడటం నగరవాసులను భయాందోళనకు గరి చేస్తోంది. హియాయత్ నగర్ ఘటన మరవకముందే చాదర్ ఘాట్ లో రోడ్డు కుంగింది. రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది.
దేశంలో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై తరచుగా రాళ్ల దాడులు జరుగుతున్నాయి. సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తోన్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలుపై మరోసారి రాళ్ల దాడి జరిగింది.
జమ్మూ కాశ్మీర్లో దేశంలోనే తొలిసారిగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లోని రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 5.9 మిలియన్ టన్ను