Home » Author »bheemraj
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లో దారుణం జరిగింది. వ్యక్తి మృతికి కారణమంటూ ఓ మహిళపై గ్రామస్థులు దాడి చేశారు. అంతేకాకుండా ఆమె మెడకు చెప్పుల దండ వేసి ఊరేగించారు.
సీఐడీ మాజీ డీజీ సునీల్ పై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కు కేంద్ర హోంశాఖ లేఖ రాసింది.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు మృతి చెందారు. రెండు రోజుల క్రితం సింహాచలం దేవస్థానంలో ప్రవళిక, వేణు వివాహ జరిగింది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు నడపనుంది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు చేసింది.
న్యూజిలాండ్ కు ప్రకృతి సవాల్ విసురుతోంది. కొన్ని రోజులుగా గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ గజగజ వణికుతుండగా భూకంపం మరింత ప్రమాదాన్ని తెచ్చి పెట్టింది. తాజాగా న్యూజిలాండ్ లోని గిస్పూర్న్ నగరంలో భూకంపం సంభవించింది.
గాబ్రియేల్ తుఫాన్ న్యూజిలాండ్ ను వణికిస్తోంది. దక్షిణ పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన పెను తుఫాన్ ధాటికి న్యూజిలాండ్ అల్లకల్లోలం అవుతోంది. మూడు రోజులుగా అతి భారీ వర్షాలు ఆ ద్వీప దేశాన్ని ముంచెత్తున్నాయి.
కొత్తపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయానికి గత జనవరి నెల కరెంట్ బిల్లు ఏకంగా రూ.11 కోట్ల 41 లక్షలు 63 వేల 672 వచ్చింది. దీంతో ఆ బిల్లును చూసిన సర్పంచ్, పంచాయతీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
ఏపీ కొత్త గవర్నర్ నియామకంపై రాజకీయంగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వంతో జస్టిస్ అబ్దుల్ నజీర్ ఎలా ఉంటారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు బిష్వభూషన్ హరిచందన్ కు వీడ్కోలు కార్యక్రమం జరుగనుంది.
జమ్మూ కాశ్మీర్ డీలిమిటేషన్ వివాదంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జమ్మూ కాశ్మీర్లో ప్రతిపాదిత డీలిమిటేషన్ను ( అసెంబ్లీ సీట్ల సంఖ్య మార్పు లేదా సవరణ) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
వరుస భూకంపాలు టర్కీ, సిరియాను బెంబేలెత్తిస్తున్నాయి. వారం క్రితం సంబవించిన భూకంపం నుంచి ఇప్పటికి తేరుకోలేకపోతున్న టర్కీని మరో భూకంపం వణికించింది. మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. టర్కీ దక్షిణ నగరమైన కహ్రామన్మరాస్ లో భూమి కంపించింది.
గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.
చివరి రోజు తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీఎం కేసీఆర్ ఈటల రాజేందర్ పేరును పదే పదే ప్రస్తావించారు. దీంతో ఈటలపై కేసీఆర్ వైఖరి మారిందా అనే చర్చ జోరందుకుంది.
హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న మూడు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెండు వ్యాన్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి.
గగన తలంలో అమెరికా గర్జిస్తోంది. అనుమానాస్పద వస్తువు కనిపిస్తేచాలు దాని అంతు చూస్తుంది. తాజాగా మరో అనుమానాస్పద వస్తువును అమెరికా మిలిటరీ కూల్చివేసింది.
సిక్కింలో భూకంపం సంభవించింది. సోమవారం (ఫిబ్రవరి13,2023) తెల్లవారుజామున 4:15 గంటలకు యుక్సోమ్ ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదు అయింది.
విజయవాడలో ఓ యువకుడు రెచ్చిపోయాడు. తనను ప్రశ్నించారన్న కోపంతో ఓ ఇంటిపై దాడి చేశాడు. కత్తులతో స్వైర వీహారం చేశాడు. తన అనుచరులతో కలిసి ప్రశ్నించిన వారిపై దాడికి తెగబడ్డాడు.
టర్కీ, అర్మేనియా దేశాల మధ్య 35 ఏళ్లుగా మూసివేసిన సరిహద్దును ఎట్టకేలకు ఓపెన్ చేశారు. దీంతో ఫస్ట్ బోర్డర్ పాయింట్ నుంచి ఇరు దేశాల మధ్య రాకపోకలు ప్రారంభమయ్యాయి.
తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా బండ ప్రకాశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా బండ ప్రకాశ్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సామాన్య జీవితం నుంచి బండ ప్రకాశ్ ఎదిగారని పేర్కొన్నారు.
అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.
బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంబించారని.. అవి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు.