Home » Author »bheemraj
మహా శివరాత్రి, వారాంతపు సెలవు దినాల సందర్భంగా తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ లో పాకిస్థాన్ కు చెందిన డ్రోన్ పట్టుబడింది. ఇవాళ (ఆదివారం) ఉదయం 9.15 గంటల సమయంలో గురుదాస్ పూర్ లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ జవాన్లు ఓ డ్రోన్ గుర్తించారు.
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును నల్లగొండ మీదుగానే నడపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. సికింద్రబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోలని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సూర్యపేట జిల్లాలో, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
వైఎస్ షర్మిలను మహబూబాబాద్ పోలీసులు అరెస్టు చేయడంతో ఉద్రికత్త నెలకొంది. స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులపై పరుష వ్యాఖ్యలు చేయడంతో షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు.
తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఉండవెల్లి మండలం బైరాపురంలో బొలేరో వాహనం, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తోన్న ముగ్గురు యువకులు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల బైపాస్ లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ని 50 రూపాయల వరకు అమ్ముకోవచ్చన్న కేంద్ర ఈఆర్ సీ నిర్ణయంపై తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజలకు విద్యుత్ సౌకర్యాన్ని దూరం చేసేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ప్రేమజంట కిడ్నాప్ డ్రామా అని తేలింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఇరువర్గాల బందువులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.
పంజాబ్ లోని గురుదాస్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్, ఆయుధాలు కలకలం రేపాయి. చైనా, టర్కీలో తయారైన ఫిస్టల్స్, ఇతర పేలుడు పదార్థాలు, పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను సరిహద్దు భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించి గాయాలు పాలు చేశారని మండిపడ్డారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అశాంతి సృష్టించడానికి చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా, ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణం పనులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అనుమతుల మేరకు 7.15 టీఎంసీల వరకు పని కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది.
అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.
పాకిస్తాన్ లో తాలిబన్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భారీగా ఆయుధాలు ధరించి పాకిస్తాన్ లోని కరాచీ పోలీస్ హెడ్ క్వార్టర్ పై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులతోపాటు నలుగురు పోలీసులు, పౌరులు చనిపోయారని కరాచీ పోలీసులు తెలిపారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.
కామారెడ్డిలో ఓ యువకుడు ఒక వీడియో కాల్ తో మోస పోయాడు. కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ చేశారు.
సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ మనోజ్ మిశ్రా విచరణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
కరీంనగర్ జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. వెండి కాయిన్స్ కు బంగారు పూత వేయించి అమ్ముతున్న ముఠా పోలీసులకు చిక్కింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.