Char Dham Yatra : ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర.. కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల దర్శనం

ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు.

Char Dham Yatra : ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర.. కేదార్ నాథ్, బద్రీనాథ్ ఆలయాల దర్శనం

Char Dham Yatra

Updated On : February 19, 2023 / 8:30 AM IST

Char Dham Yatra : ఏప్రిల్ 25 నుంచి చార్ ధామ్ యాత్ర ప్రారంభం కానుంది. చార్ ధామ్ యాత్రలో భాగంగా కేదార్ నాథ్ ఆలయాన్ని ఏప్రిల్ 25న తెరవనున్నారు. ఈ మేరకు మహాశివరాత్రి సందర్భంగా నిన్న(శనివారం) ఆలయ పున:ప్రదర్శన తేదీని ఆలయ నిర్వహకులు ప్రకటించారు. ఆ రోజు ఓంకారేశ్వర ఆలయంలో ఉదయం 4 గంటలకు మహాభిషేక పూజతో పాటు సంప్రదాయంగా నిర్వహించాల్సిన అన్ని కార్యక్రమాలు ముగిసిన తర్వాత 6:30 గంటలకు ఆలయ మహాద్వారాన్ని తెరవనున్నారు.

అలాగే అదే రోజు ఉదయం 8:30 గంటలకు కేదార్ నాథుడికి హారతి ఇవ్వనున్నారు. అదే విధంగా ఏప్రిల్ 27న ఉదయం 7:10 గంటలకు బద్రీనాథ్ ఆలయాన్ని తెరవనున్నారు. నవంబర్ 19వ తేదీన బద్రీనాథ్ ఆలయం తలుపులు మూసివేయడంతో చార్ ధామ్ యాత్ర ముగియనుంది.