USA Firing Six Killed : అమెరికా మిస్సిస్సిప్పిలో కాల్పులు.. ఆరుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.

USA Firing Six Killed : అమెరికా మిస్సిస్సిప్పిలో కాల్పులు.. ఆరుగురు మృతి

FIRE

Updated On : February 18, 2023 / 11:05 AM IST

USA Firing Six Killed : అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. రెండు రోజుల క్రితం టెక్సాస్ లోని సీలోవిస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన మరువకముందే తాజాగా మిస్సిస్సిప్పిలోని టేట్ కౌంట్ లో దుండుగుడు తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. టేట్ కౌంటీలోని అర్కబుట్ల రోడ్డులో ఉన్న ఓ షాప్ లోకి చొరబడిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా, ఇద్దరు మృతి చెందారు.

అనంతరం సమీపంలో ఉన్న ఇంట్లోకి వెళ్ళిన దుండగుడు ఇద్దరిని కాల్చి చంపాడు. మరో ఇద్దరిని అర్కబుట్ల డ్యామ్ వద్ద కాల్చి చంపాడు. వరుస కాల్పుల్లో మొత్తం ఆరుగురు మృతి చెందారని అధికారులు వెల్లడించారు. నిందితుడు కారులో పారిపోతుండగా పట్టకున్నామని చెప్పారు. కాగా, ఈ నెల 16న టెక్సాస్ లోని సీలో విస్టా షాపింగ్ మాల్ లో కాల్పుల ఘటన చోటుచేసుకుంది.

US : అమెరికాలోని మిచిగన్ యూనివర్సిటీలో కాల్పులు, ముగ్గురు మృతి

ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే కాల్పులకు పాల్పడిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు రోజే మిచిగన్ స్టేట్ యూనివర్సిటీలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. వరుస కాల్పులు యూఎస్ కలకలం రేపుతున్నాయి.