Chandrababu Angry Police : పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. దౌర్జన్యంగా ప్రవర్తించి కార్యకర్తలకు గాయాలు చేశారని మండిపాటు

పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించి గాయాలు పాలు చేశారని మండిపడ్డారు.

Chandrababu Angry Police : పోలీసులపై చంద్రబాబు ఆగ్రహం.. దౌర్జన్యంగా ప్రవర్తించి కార్యకర్తలకు గాయాలు చేశారని మండిపాటు

Chandrababu

Updated On : February 18, 2023 / 12:11 PM IST

Chandrababu Angry Police : పోలీసులపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దౌర్జన్యంగా ప్రవర్తించారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలపై దురుసుగా ప్రవర్తించి గాయాలు పాలు చేశారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బహిరంగ సభలో గాయాల పాలైన బాధితులను చంద్రబాబు పరామర్శించారు. ప్రకాష్ నాయుడు, రవి తొందరగా కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. పోలీసులపై సహాయ నిరాకరణ అనపర్తి నుంచి ప్రారంభించామని చెప్పారు.

మూడు రోజుల పర్యటనకు ముందే అనుమతులు తీసుకున్నామని గుర్తు చేశారు. రెండు రోజులు ఇచ్చిన అనుమతులు మూడో రోజు సభకు ఎందుకు నిరాకరించారని ప్రశ్నించారు. సభలకు వస్తున్న ప్రజాదారనను చూసి తట్టుకోలేక సభే జరుగకుండా చెయ్యాలని చూశారని మండిపడ్డారు. పోలీసులు చట్ట వ్యతిరేకంగా పని చేయకూడదు.. చట్టాన్ని గౌరవించాలన్నారు.

Chandrababu Anaparthi Tour : పోలీసులు వర్సెస్ చంద్రబాబు.. అనపర్తిలో ఉద్రిక్తతల నడుమ టీడీపీ అధినేత పర్యటన

ఉన్నతాధికారులు రఘురాం రెడ్డి, సునీల్ కుమార్, ఇంటెలిజెంట్ చీఫ్ సీతారామ ఆంజనేయులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కింది సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ వారిపై దండి మార్చ్ ప్రకటించిన విధంగా మనం కూడా పోలీసులపై ప్రకటించామని చెప్పారు.