Earthquake : సూర్యపేట జిల్లాలో, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద భూప్రకంపనలు
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోలని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సూర్యపేట జిల్లాలో, పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.

Earthquake
Earthquake : ఏపీ, తెలంగాణ రాష్ట్రాలోలని పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. సూర్యపేట జిల్లాలో భూకంపం సంభవించింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లోని పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం 7.25 గంటలకు భూమి కంపించింది. సుమారు 10 సెకన్లపాటు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో గతంలో పలుమార్లు భూమి కంపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోనూ భూకంపం సంభవించింది. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మాదిపాడులోని జడేపల్లి తండా, కంచిబోడు తండాల్లో భూకంపం వచ్చింది.
Earthquake : జమ్మూకశ్మీర్ లో భూకంపం.. తీవ్రత 3.6గా నమోదు
ఆదివారం ఉదయం స్వల్ప వ్యవధిలో భారీ శబ్ధంతో రెండుసార్లు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.