Mahashivratri : మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Mahashivratri : మహాశివరాత్రి.. భక్తులతో కిటకిటలాడుతున్న శైవక్షేత్రాలు

Mahashivratri

Mahashivratri : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే కైలాస నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలైన శ్రీశైలం, ద్రాక్షారామం, కోటప్పకొండ, శ్రీకాళహస్తితోపాటు వేములవాడ, కాళేశ్వరం, కీసరకు భక్తులు పోటెత్తుతున్నారు.

శివనామ స్మరణతో నల్లమల మార్మోగుతోంది. శ్రీశైల భ్రమరాంభిక మల్లిఖార్జున స్వామి వారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తుతున్నారు. శివదీక్ష చేపట్టిన శివస్వాములతో సామాన్య భక్తులు పాదయాత్ర చేస్తూ శ్రీశైలంకు తరలివస్తున్నారు.

Maha Shivratri 2022 : మహాశివరాత్రి నాడు ఏ రాశివారు ఏమంత్రం జపించాలో తెలుసా….!

శ్రీశైలంలో ఎక్కడ చూసినా శివ భక్తుల సందడే కనిపిస్తోంది. హర హర శంబో శంకర అంటూ నినదిస్తూ మల్లన్న సన్నిధికి భక్తులు చేరుకుంటున్నారు. కాళి నడకన భక్తులు మల్లన్న చెంతకు చేరుకుంటున్నారు.

ఏలూరు జిల్లాలోని పాలకొల్లు పంచారామక్షేత్రంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారిని భక్తులు దర్శించుకుంటున్నారు. శని త్రయోదశి కావడంతో భక్తులు అభిషేకాలు నిర్వహిస్తున్నారు.