Young Woman Video Call Cheating : యువతి నగ్నంగా యువకుడికి వీడియో కాల్.. రూ.60 వేలు ఇవ్వకపోతే వీడియో యూట్యూబ్ లో పెడతానని బెదిరింపు

కామారెడ్డిలో ఓ యువకుడు ఒక వీడియో కాల్ తో మోస పోయాడు. కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ చేశారు.

Young Woman Video Call Cheating : యువతి నగ్నంగా యువకుడికి వీడియో కాల్.. రూ.60 వేలు ఇవ్వకపోతే వీడియో యూట్యూబ్ లో పెడతానని బెదిరింపు

young woman

Updated On : February 17, 2023 / 2:57 PM IST

Young Woman Video Call Cheating : పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నకిలీ ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ మోసాలకు బ్రేక్ పడటం లేదు. కామారెడ్డిలో ఓ యువకుడు ఒక వీడియో కాల్ తో మోస పోయాడు. కామారెడ్డికి చెందిన ఓ యువకుడికి గుర్తు తెలియని యువతి నగ్నంగా వీడియో కాల్ చేశారు. తర్వాత మళ్లీ అతనికి ఫోన్ చేసి కాల్ రికార్డు చేశానని డబ్బులు ఇవ్వకపోతే వీడియో యూట్యూబ్ లో పెడతానని బెదిరించారు.

దీంతో అతడు యువతికి రూ.60 వేలు చెల్లించాడు. తర్వాత మరో యువకుడు బాధిత వ్యక్తికి ఫోన్ కాల్ చేసి బెదిరించాడు. బాధితుడిపై ఓ యువతి ఢిల్లీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిందని, డబ్బు పంపించాలని బెదిరించాడు.

Kurnool Honey Trap : అర్థరాత్రి అమ్మాయిల నుంచి న్యూడ్ వీడియో కాల్స్.. టెంప్ట్ అయ్యారో ఖతమే

దీంతో బాథితుడు అతనికి విడతల వారిగా రూ.60 వేలు పంపించారు. అయితే, మోస పోయానని గ్రహించిన బాధితుడు కామారెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.