Kurnool Honey Trap : అర్థరాత్రి అమ్మాయిల నుంచి న్యూడ్ వీడియో కాల్స్.. టెంప్ట్ అయ్యారో ఖతమే
కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో హనీట్రాప్ కహాని వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో యువకుడికి సెమీ న్యూడ్ వీడియో కాల్ చేసిన ఓ యువతి.. ఆ సమయంలో వీడియో కాల్ ను రికార్డ్ చేసింది.

Kurnool Honey Trap : కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో హనీట్రాప్ కహాని వెలుగులోకి వచ్చింది. మాయమాటలతో యువకుడికి సెమీ న్యూడ్ వీడియో కాల్ చేసిన ఓ యువతి.. ఆ సమయంలో వీడియో కాల్ ను రికార్డ్ చేసింది. ఆ తర్వాత తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. యువకుడి ఫొటోను మార్ఫింగ్ చేసి న్యూడ్ గా సెండ్ చేసింది.
దాన్ని అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ కు దిగింది. డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. బాధితుడు డబ్బులు పంపకపోవడంతో.. ఆమె రెచ్చిపోయింది. యువకుడి ఫ్రెండ్స్ కు ఆ న్యూడ్ వీడియోలను పంపిందా కిలేడీ. దీంతో బాధితుడు బిత్తరపోయాడు. తనను హనీట్రాప్ నుంచి కాపాడాలంటూ పోలీసులను ఆశ్రయించాడు.
సునీల్ అనే యువకుడికి అర్ధరాత్రి వేళ ఓ నెంబర్ నుండి వీడియో కాల్ వచ్చింది. ఈ టైమ్ లో ఎవరబ్బా కాల్ చేసింది అనే అనుమానం వచ్చింది. అయినా, ఎవరో తెలుసుకోవాలని కాల్ లిఫ్ట్ చేశాడు. అంతే, ఒక్కసారిగా కంగుతిన్నాడు. కాల్ ఎత్తగానే ఓ మహిళ తన డ్రెస్ తీసేస్తూ కాల్ మాట్లాడుతోంది. వెంటనే సునీల్ కాల్ కట్ చేశాడు. కానీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాల్ లిఫ్ట్ చేయడమే అతని కొంప ముంచింది. మాట్లాడిన కాసేపు.. కాల్‌ను కూడా రికార్డ్ చేశారు అవతలి వ్యక్తులు.
ఆ తర్వాత.. సునీల్ ఓ మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడుతున్నట్లుగా వీడియో క్రియేట్ చేశారు. దానిని మళ్లీ సునీల్‌కే పంపించారు. ఆ వీడియోను చూసిన అతని మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇంతలో ఆ వీడియో పంపిన మహిళ నుంచి మరో మెసేజ్ వచ్చింది. డబ్బులు కావాలని డిమాండ్ చేసింది. లేదంటే సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించింది. సునీల్ ఫ్రెండ్స్‌కు కూడా పంపుతానంది.
దీంతో సునీల్ బిత్తరపోయాడు. తన దగ్గర డబ్బులు లేవని, వీడియో ఎవరికీ పంపొద్దని వేడుకున్నాడు. అయినా ఆ కిలేడీ వినలేదు. సునీల్ దగ్గరి ఫ్రెండ్స్ అయిన ఇద్దరికి ఆ వీడియోను షేర్ చేసింది. దాంతో తన పరువు పోతుందని భయపడ్డ సునీల్.. ఏం చేయాలో అర్థం కాక కుమిలిపోయాడు.
ఇంతలో.. మరో నెంబర్ నుంచి వాట్సాప్ కాల్ వచ్చింది సునీల్‌కి. తాము సీబీఐ అధికారులం అని, నీ వీడియో యూట్యూబ్‌లో వచ్చిందని, వెంటనే డబ్బులు ఇచ్చి దానిని డిలీట్ చేయించుకోవాలని బెదిరించారు. కొన్ని మెసేజ్ లు కూడా పంపారు. దీంతో సునీల్ మరింత షాక్ కి గురయ్యాడు. వారి టార్చర్ తట్టుకోలేకపోయిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. తనను రక్షించాలని వేడుకున్నాడు. సునీల్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ తరహా మోసాల గురించి పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్స్ కాల్స్, వీడియో కాల్స్ కు స్పందించకపోవడమే బెటర్ అంటున్నారు. సమయం కాని సమయంలో కొత్త నెంబర్ నుంచి కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలంటున్నారు.