Home » Author »bheemraj
హైదరాబాద్ అంబర్ పేట్ వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు చనిపోవటం బాధాకరమని గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. బాలుడు ప్రదీప్ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం చేయాలని డిమాండ్ చేశారు.
టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ అంబర్ పేటలో దారుణం జరిగింది. వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. కుక్కల దాడి నుంచి తప్పించుకునేందుకు వీలు లేకపోవడంతో నిస్సాహాయంగా వాటికి బలయ్యాడు.
ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి 893వ జన్మదినం వేడుకను ఘనంగా జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను తిరుపతి వీధుల్లో స్వయంగా ఎమ్మెల్యే భూమన కరు�
యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర�
టీడీపీ నేత పట్టాభి రామ్ ఎక్కుడున్నారోనని ఆయన కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. పట్టాభి రామ్ ఎక్కడున్నారో ఆచూకీ లేదని ఆయన భార్య చందన అన్నారు.
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మినర్సింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి (మంగళవారం) నుండి జరుగనున్నాయి. వచ్చే నెల (మార్చి) 3వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయి. మొదటి రోజు ఉదయం 10:00 గంటలకు శ్రీ విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనం, రక్షాబంధనం ఉ�
మధ్యప్రదేశ్ లో ఓ విద్యార్థి దారుణానికి పాల్పడ్డారు. మార్కుల మెమో ఇవ్వడం లేదని ఏకంగా ప్రిన్సిపల్ పైనే పెట్రోల్ పోసి నిప్పించాడు. అనంతరం విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
ప్రకృతి ప్రకోపానికి టర్కీ చిగురుటాకులా వణికిపోతోంది. భారీ భూకంపానికి గురైన భయం ఇంకా వీడకముందే మరోసారి ఆ దేశాన్ని భూకంపం వణికించింది. ఒకటి కాదు రెండు కాదు గంటల వ్యవధిలోనే 32 సార్లు భూమి కంపించింది.
అస్సాంలో ఓ మహిళ దారుణానికి ఒడిగట్టారు. ప్రియుడితో కలిసి తన భర్త, అత్తను హత్య చేశారు. అంతే కాకుండా మృతదేహాలను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్ లో దాచారు. కొన్ని రోజులు ఫ్రిజ్ లో దాచిన తర్వాత వాటిని పాలిథిన్ కవర్ లో ఉంచి మారుమూల ప్రాంతంలో పడేశారు
నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం రేపింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆకాశం నుంచి భారీ బెలూన్ పడిపోగా, ఊర్కొండ మండల శివారులోని మామిడి తోటలో తెలుపు రంగు బెలూన్ పడి పోయింది.
బీఆర్ఎస్ పార్టీలో ఎలా చేరాలంటూ ఎమ్మెల్సీ కవితకు మహారాష్ట్ర అభిమాని ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభలు, కార్యక్రమాల్లో పాల్గొని, సీఎం కేసీఆర్ కు మద్దతు పలకాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు.
అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ రిజిస్ట్రార్ తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశం అయింది. యూనివర్శిటీలో మృత్యుంజయ హోమం జరిపించాలని రిజిస్ట్రార్ నిర్ణయించారు.
నెల్లూరు ఆర్ఎస్ఆర్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం నెలకొంది. సీనియర్ విద్యార్థుల బెదిరింపులకు విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపణలు వెలివెత్తుతున్నాయి.
సంధ్య కన్వెన్షన్ ఎండీ సంధ్య శ్రీధర్ అరెస్టు అయ్యారు. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బంధువును మోసం చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను వైసీపీ ప్రకటించనుంది. సోమవారం తొమ్మిది మంది అభ్యర్థుల ఎంపికను సీఎం జగన్ ఫైనల్ చేయనున్నారు. ఇప్పటికే ఇద్దరు పేర్లు ఖరారు అయ్యాయి. జయమంగళ వెంటకరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఖరారు అయ్యాయి.
ఛత్తీస్ గఢ్ రాయ్ పూర్ లో అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికపై 47 ఏళ్ల వ్యక్తి పదునైన ఆయుధంతో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు.
అనారోగ్యంతో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న అంత్యక్రియలు సోమవారం (ఫిబ్రవరి20,2023) జరుగనున్నాయి. బన్సీలాల్ పేటలో ప్రభుత్వ లాంఛనాలతో సాయన్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.
ప్రజాప్రస్థానం మూడు వేల కిలోమీటర్లు దాటినప్పటి నుంచి పాదయాత్రను అడ్డుకుంటూనే ఉన్నారని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి దాడి చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు.