Huge Balloon : నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ యంత్రంతో కూడిన బెలూన్ కలకలం
నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం రేపింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆకాశం నుంచి భారీ బెలూన్ పడిపోగా, ఊర్కొండ మండల శివారులోని మామిడి తోటలో తెలుపు రంగు బెలూన్ పడి పోయింది.

huge balloon
Huge Balloon : నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం రేపింది. కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామ శివారులో ఆకాశం నుంచి భారీ బెలూన్ పడిపోగా, ఊర్కొండ మండల శివారులోని మామిడి తోటలో తెలుపు రంగు బెలూన్ పడి పోయింది. ఒక్కసారిగా ఆకాశం నుంచి భారీ యంత్రంతో కూడిన బెలూన్ పడిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. బెలూన్, యంత్రాన్ని పోలీసులు పరిశీలించారు. ఆ బెలూన్ హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంట్ రిసెర్చ్ కు చెందినదిగా గుర్తించారు. అనంతరం బెలూన్, యంత్రాన్ని అధికారులు హైదరాబాద్ కు తరలించారు.
అంతరిక్ష పరిశోధనలతో పాటు భూ ఉపరితలంపై వాతారణ కాలుష్యం, ఓజోన్ పొరపై అధ్యయనం చేసేందుకు బెలూన్ ను ఆకాశంలోకి పంపించామని టీఐఎఫ్ఐఆర్ కు చెందిన సైంటిఫిక్ అధికారులు చెప్పారు.