Home » Author »bheemraj
ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ పై చర్యలు తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధమైంది. కేంద్ర హోంశా ఆదేశాలతో సునీల్ కుమార్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపికి సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రీతి ఆత్మహత్యాయత్నానికి ముందు సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడ్డారు. సైఫ్ తనతోపాటు జూనియర్స్ ను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు.
నవీన్ హత్య కేసులో మరో కీలక విషయం బయటపడింది. ముసారాంబాగ్ లో అక్కాబావలతో నివాసముంటున్న హరి హర కృష్ణ..నవీన్ హత్య చేసిన తర్వాత ఇంటికి కూడా రాలేదు. మలక్ పేట పోలీసు స్టేషన్ లో దీనికి సంబంధించి ఫిబ్రవరి 23న హరహర కృష్ణపై మిస్సింగ్ కేసు నమోదు అయింది.
మెడికో విద్యార్థి ప్రీతి ఆరోగ్యం రోజు రోజుకూ మరింత క్షీణిస్తోంది. ఇప్పటివరకు ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు అంటున్నారు. ఎక్మోపై చికిత్స అందిస్తూ వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నారు.
చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.
నెల్లూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. రాపూరు-చిట్వేల్ ఘాట్ రోడ్డులో చిరుత పులి కనిపించింది.
పాపువా న్యూ గినియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.2గా నమోదైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది.
ఆఫ్ఘనిస్తాన్లోని ఫైజాబాద్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఓ ప్రైవేట్ డాక్టర్ నిర్వాకం బయటపడింది. ఓ మహిళ డాక్టర్ ఆపరేషన్ చేసి కడుపులో కత్తెర మరిపోయారు. గోదావరి ఖనిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.
మెడికో విద్యార్థి ప్రీతికి మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని బీఎస్పీ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అన్నారు. పేద వర్గం నుంచి వచ్చిన ప్రీతి చాలా కష్టపడి చదివిందని చెప్పారు.
హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. స్టూడెంట్ ఎన్నిక సమావేశం సందర్భంగా పోస్టర్స్ అతికించే విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది.
అనేక సార్లు జిల్లా సమావేశాల్లో సమస్యలపై మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలుపై మాట్లాడానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం వెన్నుచూపను.. మడిమ తిప్పను. భయపడను.. ఎంతటి వారినై�
నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓ తండ్రి తన కూతురిని హత్య చేశాడు. కూతురు ప్రసన్న గొంతు కోసి చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ
శ్రీవాణి ఆన్ లైన్ కోటా టికెట్లను శనివారం(ఫిబ్రవరి25,2023) తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) విడుదల చేయనుంది. మార్చి, ఏప్రిల్, మే నెలల కోటా టికెట్లను శనివారం మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ఇవాళ (శనివారం) సీబీఐ ప్రశ్నించనుంది. శనివారం విచారణకు హాజరు కావాలని భాస్కర్ రెడ్డికి సీబీఐ నోటీసులు జారీ చేసింది.
చంద్రుడి మీదకు రష్యా మూన్ లాండల్ లూనా -25 ను పంపనుంది. ఆ ప్రయోగ తేదీనీ రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కన్ మస్ ప్రకటించింది. లూనా-25 స్పేస్ క్రాఫ్ ను జులై 13వ తేదీన లాంచ్ చేయనున్నట్లు రాస్కన్ మస్ తెలిపింది.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారాయణ రెండో కుమార్తె నివాసంలో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, మాదాపూర్, కొండాపూర్ శరణి నివాసంలో ఏక కాలంలో సీఐడీ అధికారుల తనిఖీలు చేశారు.