Road Accident : ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

Road Accident : ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు మృతి

road accident

Updated On : February 26, 2023 / 10:10 AM IST

Road Accident : చిత్తూరు జిల్లాలోని శెట్టిపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కుప్పం-పలమనేరు జాతీయ రహదారిపై లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు అయింది.

ఈ ప్రమాదానికి అతి వేగమే కారణంగా అనుమానిస్తున్నారు. మృతులు కడప, నెల్లూరు వాసులుగా గుర్తించారు. మృతి చెందిన విద్యార్థులు కుప్పం పీఈఎస్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు.

Road Accident Six Died : పెళ్లికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ, ఆటో ఢీకొని ఆరుగురు మృతి

స్నేహితుడి పుట్టిన రోజు సందర్భంగా బర్త్ డే పార్టీ జరుపుకుని అనంతరం తిరిగి హాస్టల్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ముగ్గురు విద్యార్థుల మృతితో విషాదఛాయలు అలుముకున్నాయి.