Home » Author »bheemraj
హక్కుల న్యాయవాది, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అలెస్ బియాలిస్కీకి జైలు శిక్ష పడింది. బెలారస్ కు చెందిన అలెస్ బియాలిస్కీకి స్థానిక కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది.
ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆయిల్ డిపోలో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు.
రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వసతులు లేకపోవడంపై ఎల్ ఎల్ బీ విద్యార్థి మనిదీప్ రాసిన లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. కనీస వసతులైన తాగు నీరు, మరుగు దొడ్ల సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ల�
హైదరాబాద్ లో జిమ్ కు వెళ్తోన్న యువకులే టార్గెట్ గా మాఫియా రెచ్చి పోతోంది. బాడీ ఫిట్ నెస్ కోసమంటూ ఇంజెక్షన్లను అంటగడుతోంది. పక్కా సమాచారంతో దాడులు చేసిన అధికారులు భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను పట్టుకున్నారు.
రామంతాపూర్ ఇందిరానగర్ లో విషాదం చోటు చేసుకుంది. తల్లితో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లి పోయిన విద్యార్థిని అనూష రామంతాపూర్ చెరువులో శవమై కనిపించింది. విద్యార్థిని మృతిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించారు. సోనియాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసిన ఘటన నగరంలో అలజడి రేపింది.
నడకదారి భక్తులకు త్వరలో టోకెన్లు పున:ప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో రాధామోహన్ దాస్ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని అన్నారు.
లండన్ లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందన్నారు. తన ఫోన్ రికార్డ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు.
భారతీయ రైల్వే శాఖ వివిధ కారణాలతో ప్రతి రోజూ వందల సంఖ్యలో రైళ్లను రద్దు చేస్తోంది. అందులో భాగంగా శుక్రవారం కూడా దేశవ్యాప్తంగా 240 రైళ్లను రద్దు చేసింది. మెయింటనెన్స్, మౌలిక సదుపాయాల కల్పన, భద్రతా కారణాల దృష్ట్యా మార్చి 3న నడవాల్సిన 240కిపైగా రైళ్�
చంద్రుడు క్రమంగా భూమికి దూరమవుతున్నాడు. భూమికి ఉప గ్రహమైన చంద్రుడు క్రమంగా దూరమవుతున్నాడు. చంద్రుడు రోజు రోజుకూ భూమికి దూరమవుతున్నట్లు నాసా శాస్త్రవేత్తలు తాజాగా కనుగొన్నారు.
ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సుల్తాన్ పూర్ లోని మురికివాడలో మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇళ్లన్నీ తగలబడ్డాయి.
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసు నిందితుడు హరిహర కృష్ణ కస్టడీపై తీర్పును రంగారెడ్డి జిల్లా కోర్టు రేపటికి వాయిదా వేసింది. నిందితుడు హరిహర కృష్ణను ఎనిమిది రోజులు కస్టడీకి ఇవ్వాలన్న విషయంపైన రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్ట�
శంషాబాద్ లో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో అతను రోడ్డుకు అడ్డంగా వాహనం నిలిపి ట్రాఫిక్ కు అంతరాయం కల్పించాడు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో బంగారం అక్రమంగా విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. మైలార్ దేవ్ పల్లిలో బంగారం అక్రమంగా విక్రయిస్తుండగా ఎస్ వోటీ పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
విజయనగరం జిల్లాలో ఓ వింత ఫ్యామిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. భర్త, అతడి కుటుంబసభ్యులు భార్యను 11 ఏళ్లు ఇంట్లోనే బంధించారు. వివాహిత పుట్టింటిని వారిని కూడా కలవనివ్వకుండా చీకటి గదికే పరిమితం చేశాడు.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో భూముల రిజిస్ట్రేషన్ వ వాదం సమసిపోయింది. తిరుపతిలో పలు సర్వే నెంబర్లలోని భూముల ఆస్తులపై ఇటీవల విధించిన నిషేదాన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఎత్తివేసింది.
ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ పైన కేంద్ర ప్రభుత్వం యాక్షన్ తీసుకుంది. ఈ సంస్థకు వచ్చిన విదేశీ నిధులపైన నిఘా పెట్టిన కేంద్రం.. జార్జ్ సోరస్ బృందంపై చర్యలు చేపట్టింది.
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయింది. కమిటీ ముందు హాజరైన అనస్థీషియా హెచ్ వోడీ నాగార్జున రెడ్డి, 14 మంది సభ్యుల ర్యాగింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. మెడికో విద్యార్థి ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు కమిటీ నిర్ధారించి�
శ్రీచైతన్య కాలేజీ విద్యార్థి సాత్విక్ సూసైడ్ లెటర్ 10 టీవీ చేతికి చిక్కింది. సూసైడ్ లెటర్ లో పలు కీలక అంశాలను సాత్విక్ ప్రస్తావించారు. కాలేజీలో ప్రిన్సిపల్, లెక్షరర్ పెట్టే టార్చర్ ను సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.