Medico Preeti Case : మెడికో ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు నిర్ధారణ.. సైఫ్ మెంటల్ గా వేధించినట్లు తేల్చిన కమిటీ
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయింది. కమిటీ ముందు హాజరైన అనస్థీషియా హెచ్ వోడీ నాగార్జున రెడ్డి, 14 మంది సభ్యుల ర్యాగింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. మెడికో విద్యార్థి ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు కమిటీ నిర్ధారించింది.

preeti
Medico Preeti Case : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ కమిటీ భేటీ అయింది. కమిటీ ముందు హాజరైన అనస్థీషియా హెచ్ వోడీ నాగార్జున రెడ్డి, 14 మంది సభ్యుల ర్యాగింగ్ పై సుదీర్ఘంగా చర్చించారు. మెడికో విద్యార్థి ప్రీతి ర్యాగింగ్ కు గురైనట్లు కమిటీ నిర్ధారించింది. ప్రీతిని మెంటల్ గా సైఫ్ వేధించినట్లు తేల్చారు. నాగార్జున రెడ్డి, ఇతర ప్రొఫెసర్లు ప్రీతి ఆత్మహత్య చేసుకున్న రోజు డ్యూటీలో ఉన్న ఇతర సిబ్బంది నుంచి యాంటీ ర్యాగింగ్ కమిటీ వివరాలు తీసుకుంది. యూసీజీకి సీల్డ్ కవర్ లో నివేదిక పంపిస్తామని ప్రిన్సిపాల్ డా.మోహన్ దాస్ అన్నారు.
మరోవైపు సైఫ్ రిమాండ్ రిపోర్టులో పోలీసులు పలు కీలక అంశాలు వెల్లడించారు. సైఫ్ ఫోన్ నుంచి 17 వాట్సాప్ చాట్స్ ను పోలీసులు పరిశీలించారు. ఎల్ డీడీ, నాకౌట్స్ గ్రూప్ నుంచి చాట్స్ ను పరిశీలించారు. అనస్థీషియా డిపార్ట్ మెంట్ లో ప్రీతిని సూపర్ వైజ్ చేస్తున్న సీనియర్ గా డా.సైఫ్ ఉన్నారు. ఓ రెండు ఘటనల ఆధారంగా ప్రీతిపై సైఫ్ కోపం పెంచుకున్నారని పోలీసులు తెలిపారు. డిసెంబర్ లో ఓ యాక్సిడెంట్ కేసు విషయంలో ప్రీతిని సైఫ్ గైడ్ చేశారు. గైడ్ చేసిన సమయంలోనే ప్రీతిని సైఫ్ వేధింపులకు గురి చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.
ప్రీతి ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్టు రాశారు. వాట్సాప్ గ్రూప్ లో ప్రీతి రాసిన రిపోర్టును సైఫ్ హేళన చేశారు. రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ సైఫ్ అవమానించారు. తనతో ప్రాబ్లమ్ ఉంటే హెచ్ వోడీకి చెప్పాలని సైఫ్ కు ప్రీతి వార్నింగ్ ఇచ్చారు. ప్రీతిని వేధించాలని సైఫ్ తన స్నేహితుడికి చెప్పారని పోలీసులు వెల్లడించారు. ఆర్ఐసీయూలో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని సైఫ్ చెప్పారు.గత నెల 21న హెచ్ వోడీ నాగార్జునకు ప్రీతి ఫిర్యాదు చేశారు.
దీంతో ప్రీతి, సైఫ్ కు ముగ్గురు వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మొత్తం 19 మంది సాక్షులను రిపోర్టులో ప్రవేశపెట్టారు. 19 పంచులు, 17 వాట్సాప్ చాట్ లు,
ఘటనాస్థలంలో ప్రీతి కేసుకు సంబంధించి మొత్తం 23 వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఈ వ్యవహారం నెల రోజులుగా ముదురుతున్నట్లుగా తెలిపారు. 15 రోజులకు సంబంధించిన తతంగం మొత్తాన్ని పోలీసులు కోర్టు ముందు ఉంచారు.
ప్రీతి అపస్మారకస్థితిలో ఉన్నప్పుడు ఎంజీఎంలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న మండే విజయలక్ష్మీ మొట్ట మదటి సారిగా ఆమెను చూశారు. ప్రీతి అపస్మారకస్థితిలో డిపార్ట్ మెంట్ లో పడి ఉన్న విషయాన్ని అక్కడ ప్రీతితోపాటు విధులు నిర్వహిస్తున్నటువంటి సెకండర్ ఇయర్ స్టూడెంట్ డా.రోహి, అదేవిధంగా థర్డ్ ఇయర్ స్టూడెంట్ డా.మనీషా వీరిద్దరూ ప్రీతితోపాటు డ్యూటీ చేస్తున్నారు. స్టాఫ్ నర్స్ విజయలక్ష్మీ వెళ్లి విషయం చెప్పిన తర్వాత వారు అలర్ట్ అయ్యారన్న విషయాలను రిపోర్టులో స్పష్టంగా పేర్కొన్నారు.