Ales Bialiatski : నోబెల్ ప్రైజ్ గ్రహీతకు పదేళ్ల జైలు శిక్ష
హక్కుల న్యాయవాది, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అలెస్ బియాలిస్కీకి జైలు శిక్ష పడింది. బెలారస్ కు చెందిన అలెస్ బియాలిస్కీకి స్థానిక కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది.

Ales Bialiatski
Ales Bialiatski : హక్కుల న్యాయవాది, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అలెస్ బియాలిస్కీకి జైలు శిక్ష పడింది. బెలారస్ కు చెందిన అలెస్ బియాలిస్కీకి స్థానిక కోర్టు పదేళ్లు జైలు శిక్ష విధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించేలా ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ, స్మగ్లింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలపై ఓ కేసులో బియాలిస్కీతోపాటు ఆయన స్థాపించిన హక్కుల సంస్థ వియస్నాకు చెందిన మరో ముగ్గురిని కోర్టు దోషులుగా తేల్చింది. 1980లో బెలారస్ లో ప్రజాస్వామ్య ఉద్యమాన్ని ప్రారంభించినవారిలో బియాలిస్కీ ఒకరు.
ప్రజాస్వామ్యం, శాంతియుత అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేశారు. 2020లో జరిగిన ఎన్నికల విషయంలో దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్ కు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనల నేపథ్యంలో బియాలిస్కీతోపాటు అతని ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు. 2021 జులై నుంచి వీరు జైలులో విచారణ ఖైదీలుగా ఉన్నారు. సలావ్యూ అప్పటికే బెలారస్ వదలిపెట్టి వెళ్లి పోయారు.
Chinese Spy: అమెరికా ఎఫ్‌బీఐకి దొరికిపోయిన చైనా గూఢచారికి 20 ఏళ్ల జైలు శిక్ష
బియాలిస్కీ జైలులో ఉన్న సమయంలోనే గతేడాది(2022)అక్టోబర్ లో ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి వరించింది. బెలారస్ అధ్యక్షుడు లుకిషెంకతో తన పాలనలో నిరసన కారులపై ఉక్కు పాదం మోపుతారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్ష నేత సియాతన్ లా తాజా తీర్పును ఖండించారు. ఈ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేందుకు, వారిని విడిపించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.