Hyderabad Central University : హెచ్ సీయూలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ

హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. స్టూడెంట్ ఎన్నిక సమావేశం సందర్భంగా పోస్టర్స్ అతికించే విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది.

Hyderabad Central University : హెచ్ సీయూలో ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ

Hyderabad Central University (1)

Updated On : February 25, 2023 / 1:47 PM IST

Hyderabad Central University : హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. స్టూడెంట్ ఎన్నిక సమావేశం సందర్భంగా పోస్టర్స్ అతికించే విషయంలో వారి మధ్య వివాదం నెలకొంది. వాగ్వాదానికి దిగిన ఇరువర్గాలు పరస్పర దాడులకు పాల్పడ్డారు.

ఈ ఘర్షణలో పలువురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో ఏబీవీపీ విద్యార్థులపై ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు.