MLA Bhumana Karunakar : ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం : ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి 893వ జన్మదినం వేడుకను ఘనంగా జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను తిరుపతి వీధుల్లో స్వయంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పంచారు.

MLA Bhumana Karunakar : ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవం : ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

Tirupati

Updated On : February 21, 2023 / 1:16 PM IST

MLA Bhumana Karunakar : ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపనున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. తిరుపతి 893వ జన్మదినం వేడుకను ఘనంగా జరుపుకుందామంటూ పిలుపునిచ్చారు. ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను తిరుపతి వీధుల్లో స్వయంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పంచారు. సౌమ్యనామ సం॥ పాల్గుణ పౌర్ణమి, ఉత్తరా నక్షత్ర సోమవారం 24-02-1130న తిరుపతి పట్టణం ఆవిర్భవించిందని చెప్పారు.

భగవద్ రామానుజాచార్యుల వారు తిరుపతిలో ఆ రోజన శ్రీ గోవిందరాజస్వామి వారిని ప్రతిష్ఠించి, కైంకర్య నిర్వహణ కార్యక్రమాలు రూపొందించి, నాలుగు మాడవీధుల నిర్మాణం ప్రారంభించారని వెల్లడించారు. రామానుజుల రాక పూర్వం తిరుపతి పట్టణం లేదని.. కీకారణ్యం ఉండేదన్నారు. శ్రీవారి ఆలయం కూడా తిరుచానూరులోనే ఉండేదని.. ఉత్సవాలన్నీ అక్కడే జరిగేవని చెప్పారు.

Srivani Darshan Tickets : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. తిరుపతిలోనే శ్రీవాణి దర్శనం టికెట్లు

నగర అంకురార్పణ జరిగిన కచ్చితమైన తేది ఒక్క తిరుపతికి తప్ప.. ఏ నగరానికి లేదన్నారు. తిరుపతి తొలుత “గోవిందరాజ పట్టణం”గా, తరువాత “రామానుజపురం”గా పిలిచేవారని తెలిపారు. 13వ శతాబ్దపు ప్రారంభం నుంచి మాత్రమే తిరుపతిగా పిలుస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 24న నగర వీధుల గుండా భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.