Yadagirigutta Brahmotsavams : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు.. పునర్నిర్మాణం తర్వాత తొలి వార్షికోత్సవాలు
యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించారు.

Srilakshminarasimha Swamy
Yadagirigutta Brahmotsavams : యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహా స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం స్వస్తివచనం, పుణ్యవచనంతో శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. విష్వక్సేన పూజ, స్వస్తి, పుణ్యవచన పూజా కైంకర్యాలను అర్చకులు నిర్వహించారు. ఆలయ ఈవో గీతారెడ్డి, ఆలయ చైర్మన్ నరసింహమూర్తితోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సాయంత్రం 6:30 గంటలకు మృత్సం గ్రహణము, అంకురారోహణ జరుగనుంది.
ఇవాళ (మంగళవారం) ప్రారంభమైన శ్రీలక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వచ్చే నెల (మార్చి) 3వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటయ్యాక 1955లో యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను 11 రోజులపాటు నిర్వహించారు. అంతకముందు యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు భక్తోత్సవాలను నిర్వహించేవారు. పునర్నిర్మాణం తర్వాత ఇలవైకుంఠంగా విరాజిల్లుతున్న ఆలయంలో తొలి వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి.
Yadadri : యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామికి విరాళంగా 30 తులాల బంగారం
మంగళవారం ఉదయం విష్వక్సేనారాధన, స్వస్తివాచనం, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. 27న ఎదుర్కోలు, 28న సాయంత్రం తిరు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. స్వామివారి కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. మార్చి3 వరకు 11 రోజులపాటు సాగే వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. విద్యుద్దీపాలంకరణ, రంగురంగుల పూలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అలంకార సేవలకు సర్వం సిద్ధం చేశారు.
యాదగిగుట్ట క్షేత్రంలో ప్రతి యేటా ఫాల్గుణ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతాయి. ఉత్సవాలను మొదటగా సృష్టికర్త ప్రారంభించడంతో బ్రహ్మోత్సవాలు అన్న పేరు స్థిరపడింది. ఈ ఉత్సవాలతో స్వామి క్షేత్రం 11 రోజులపాటు ముక్కోటి దేవతలకు విడిదిగా మారుతుందని అర్చకులు చెబుతున్నారు. బ్రహ్మోత్సవ వేళ యాదగిరి వేదగిరి అన్న ప్రాచీన నామాన్ని సార్థకం చేసుకుంటుంది. ఈ సందర్భంగా సకల దేవతలను శాస్త్రోక్తంగా ఆహ్వానించి వేదోక్తంగా పూజలు నిర్వహించడం ఆలయ సంప్రదాయంగా వస్తోంది.
Yadadri Break Darshans : యాదాద్రిలో కూడా తిరుమల మాదిరిగా బ్రేక్ దర్శనాలు, ఆన్‌లైన్ దర్శనాలు
విశ్వక్సేన పూజలతో మొదలైన ఉత్సవాలు స్వయంభువులకు నిర్వహించే అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలుకుతారు. మొదట ధ్వజారోహణంలో మహావిష్ణువు వాహనమైన వేద స్వరూపుడు గరుత్మంతుడికి పూజలు నిర్వహిస్తారు. మూడో రోజు నుంచి స్వామి వారి అలంకార సంబురాలు జరుపుతారు. ఏడు, ఎనిమిది, తొమ్మిది రోజుల్లో విశేష పర్వాలైన ఎదుర్కోలు, తిరుకల్యాణ మహోత్సవం, రథయాత్ర నిర్వహిస్తారు. పదో రోజున చక్రతీర్థ స్నానం జరుపనున్నారు.