Miscreants Attacked Asaduddin Residence : ఢిల్లీలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు.

Miscreants Attacked Asaduddin Residence : ఢిల్లీలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇంటిపై రాళ్ల దాడి

Asaduddin Owaisi

Updated On : February 20, 2023 / 7:24 AM IST

Miscreants Attacked Asaduddin Residence : ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నివాసంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఢిల్లీ అశోక్ రోడ్డులోని ఆయన అధికారిక నివాసంపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. రాజస్థాన్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరకముందే ఆయన ఇంటిపై దుండగులు దాడి చేశారు. ఇప్పటివరకు అసదుద్దీన్ ఇంటిపై నాలుగు సార్లు దాడి జరిగింది.

ఆదివారం సాయంత్రం ఈ దాడి జరుగగా రాత్రి తన ఇంటికి వచ్చిన అసదుద్దీన్ ఈ దాడిని గుర్తించారు. రాళ్ల దాడిపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆనవాళ్లు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.