Minister Jogi Ramesh Comments : చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

Minister Jogi Ramesh Comments : చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి జోగి రమేశ్ సంచలన వ్యాఖ్యలు

Jogi Ramesh

Updated On : February 21, 2023 / 2:35 PM IST

Minister Jogi Ramesh Comments : టీడీపీ నేతల తీరుపై ఏపీ మంత్రి జోగి రమేశ్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు, లోకేశ్ పై మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు వీధి రౌడీలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. అధికారం కోసం రోడ్లపై పడి బూతులు తిడుతున్నారని పేర్కొన్నారు. తండ్రీకొడుకులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. పోలీసులపై దాడి చేస్తూ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు.

తండ్రి, కొడుకు మెంటల్ ఆస్పత్రికి వెళ్లక తప్పదన్నారు. చంద్రబాబు, లోకేశ్ పద్ధతి మార్చుకోకపోతే వారిని ప్రజలే కొడతారని పేర్కొన్నారు. లోకేశ్ మాటలు, చేష్టలు సరిచేసుకోకపోతే ఓటమి తప్పదని హెచ్చరించారు. పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా టీడీపీకి రాజకీయ సమాధి తప్పదని స్పష్టం చేశారు.

Minister Jogi Ramesh : ఏ తప్పు చేయకపోతే గోడ దూకి ఎందుకు పారిపోయాడు? చింతకాయల అయ్యన్నపై మంత్రి జోగి రమేష్ ఫైర్

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై చంద్రబాబుకు ప్రేమ ఉంటే బడ్జెట్ సెషన్ లో పాల్గొనాలన్నారు. ఏపీలో అన్ని వర్గాలకు జగన్ న్యాయం చేశారని తెలిపారు. సామాజిక న్యాయం అంటే ఏంటో జగన్ చూపించారని పేర్కొన్నారు.