Fire Incident : హైదరాబాద్ కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. బస్సు, రెండు వ్యాన్ లు దగ్ధం

హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న మూడు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెండు వ్యాన్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి.

Fire Incident : హైదరాబాద్ కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం.. బస్సు, రెండు వ్యాన్ లు దగ్ధం

fire incident

Updated On : February 13, 2023 / 9:54 AM IST

Fire Incident : హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ లో ఉన్న మూడు వాహనాల్లో మంటలు చెలరేగాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, రెండు వ్యాన్ లు అగ్నికి ఆహుతి అయ్యాయి. కూకట్ పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద భారతీ ట్రావెల్స్ కు చెందిన మూడు బస్సుల్లో అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.

దీంతో అప్రమత్తమైన సిబ్బంది పక్కనే ఉన్న బస్సులను అక్కడి నుంచి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా నిప్పంటించారా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.