Special Buses Maha Shivaratri : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు నడపనుంది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు చేసింది.

Special Buses Maha Shivaratri : టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్.. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు

Special Buses

Updated On : February 14, 2023 / 8:50 AM IST

Special Buses Maha Shivaratri : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) గుడ్ న్యూస్ తెలిపింది. మహా శివరాత్రికి 2,427 ప్రత్యేక బస్సులు నడపనుంది. శ్రీశైలానికి 578, ఏడుపాయలకు 497, వేములవాడకు 481 బస్సుల ఏర్పాటు చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు సర్వీసులు నడవనున్నాయి. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 18న మహా శివరాత్రిని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం 2,427 ప్రత్యేక బస్సులను నడపాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిర్ణయించింది.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి 40 శైవక్షేత్రాలకు ఈ నెల 17 నుండి 19 వరకు మూడు రోజుల పాటు ఈ ప్రత్యేక సర్వీసులను తిప్పనుంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి 578, వేములవాడకు 481, కీసరగుట్టకు 239, ఏడుపాయలకు 497, వేలాలకు 108, కాళేశ్వరానికి 51, కొమురవెల్లికి 52, కొండగట్టుకు 37, అలంపూర్‌కు 16, రామప్పకు 15, ఉమా మహేశ్వరానికి 14 ప్రత్యేక బస్సులను నడపనుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా.. రద్దీకి అనుగుణంగా మరిన్ని సర్వీస్‌లను నడిపేలా టీఎస్‌ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది.

Srisailam : శ్రీశైలంలో 11 నుండి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, భక్తులకు 4 రకాల దర్శనాలు

శ్రీశైలం పుణ్యక్షేత్రానికి హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్‌ నుంచి పత్యేక బస్సులు భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఈ బస్సు సర్వీస్‌లకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని టీఎస్‌ఆర్టీసీ కల్పించింది. మహారాత్రి శివరాత్రి సందర్భంగా భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోందని టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్‌, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్‌, ఐపీఎస్‌ తెలపారు. రాష్ట్రంలోని 40 ప్రముఖ శైవాలయాలకు ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించామని చెప్పారు.

రద్దీకి అనుగుణంగా మరిన్ని పత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. భక్తులు ఈ ప్రత్యేక సర్వీస్‌లను ఉపయోగించుకుని క్షేమంగా శైవాలయాలకు చేరుకొని.. మొక్కులు చెల్లించుకోవాలని కోరారు. అద్దె బస్సులపై 10 శాతం రాయితీని టీఎస్ఆర్టీసీ కల్పిస్తోందని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు. మహాశివరాత్రికి ఈ అద్దె బస్సు సౌకర్యాన్ని భక్తులు ఉపయోగించుకోవాలని సూచించారు.