Part Of Sun Separated : సూర్యుడి నుంచి విడిపోయిన కొంత భాగం

సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడింది. సూర్యుడిపై జరిగిన ఈ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురి చేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోయినట్లు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు.

Part Of Sun Separated : సూర్యుడి నుంచి విడిపోయిన కొంత భాగం

sun (1) (1)

Updated On : February 11, 2023 / 7:51 AM IST

Part Of Sun Separated : సూర్యుడి నుంచి కొంత భాగం వేరు పడింది. సూర్యుడిపై జరిగిన ఈ అసాధారణ పరిణామం శాస్త్రవేత్తలను ఉలికిపాటుకు గురి చేసింది. సూర్యుడి నుంచి కొంత భాగం విడిపోయినట్లు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అంతరిక్ష శాస్త్రేవేత్త డా. తమిత స్కోవ్ ట్వీట్ చేశారు.

సూర్యుడి నుంచి వేరు పడిన భాగం ఉత్తర ధృవం దగ్గర నిప్పులు చిమ్ముతూ, సుడులు తిరుగుతుందని.. సెకనుకు 96 కిలో మీటర్ల వేగంతో ఇది కదులుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సాధారణంగా సూర్యుడి నుంచి భారీ సౌర మంటలు విరజిమ్ముతుంటాయి.

Sun Incorporate Earth : భూమిని సూర్యుడు కబళించనున్నాడా? తనలో కలుపుకుని భస్మీపటలం చేయనున్నాడా?

అవి ఒక్కసారి భూమి మీద సమాచార వ్యవస్థలపై ప్రభావం చూపిస్తాయి. అలాంటిది ఒక భారీ భాగం సూర్యుడి నుంచి వేరు పడటం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో విశ్లేషించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు.